వివిధ దేశాల్లో ఆడపిల్లల అధికారిక వివాహ వయసు ఇలా.. నైగర్‌లో బాల్య వివాహాలు అధికారికమే..!

Published : Dec 16, 2021, 04:21 PM IST
వివిధ దేశాల్లో ఆడపిల్లల అధికారిక వివాహ వయసు ఇలా.. నైగర్‌లో బాల్య వివాహాలు అధికారికమే..!

సారాంశం

మనదేశంలో మహిళలకు కనీస వివాహ వయసు పరిమితిని పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఈ పరిమితి 18 ఏళ్లుగా ఉన్నది. దీన్ని 21 ఏళ్లకు పెంచాలనే ప్రతిపాదనను కేంద్ర క్యాబినెట్ ఆమోదించింది. ఈ నేపథ్యంలోనే వివిధ దేశాల్లో కనీస వివాహ వయసులు ఎలా ఉన్నాయో ఓ సారి చూద్దాం. నైగర్‌లో మాత్రం బాల్య వివాహాలు లీగల్‌గా ఉండటం గమనార్హం.  

న్యూఢిల్లీ: మన దేశంలో ఆడపిల్లల వివాహ వయసు(Legal Age)ను పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర మంత్రి వర్గం ఆ ప్రతిపాదనను ఆమోదించింది. ప్రస్తుతం మన దేశంలో ఆడవారి(Women)కి అధికారిక వివాహ వయసు 18 ఏళ్లు. మగవారికి అధికారిక వివాహ(Marriage) వయసు 21 ఏళ్లు. గత కొన్నేళ్లుగా కేంద్ర ప్రభుత్వం ఆడవారికి అధికారిక వివాహ వయసు పెంచాలనే ఆలోచనలో ఉన్నది. తాజాగా, ఈ వయసును 18 ఏళ్ల నుంచి 21 ఏళ్లకు పెంచాలనే ప్రతిపాదనకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలోనే ఇతర దేశాల్లో ఈ వయసు గురించి తెలుసుకోవాలనే ఆసక్తి కలగడం సహజం. అయితే, ఈ ఆసక్తితో కొన్ని దేశాల వివరాలు పరిశీలిస్తే ఆశ్చర్యకర విషయాలు తెలుస్తున్నాయి. ఉదాహరణకు ట్రినిడాడ్ టొబాగో‌లో అధికార 

అందుబాటులో ఉన్న కొన్ని దేశాల వివరాలను బట్టి చూస్తే సగటు పెళ్లి వయసు మగవారికి 17 ఏళ్లు, ఆడవారికి 16 ఏళ్లుగా ఉన్నట్టు అర్థం అవుతున్నది. అయితే, చాలా దేశాలు తమ కంటే చిన్నవారైన మగవారిని పెళ్లి చేసుకోవడానికి మహిళలకు అవకాశాలు ఇస్తున్నాయి. కొన్ని దేశాలు టీనేజ్ దాటక ముందే పెళ్లి చేసుకోవడానికీ అనుమతులు ఇస్తున్నాయి.

Also Read: అమ్మాయిల కనీస వివాహ వయసు పెంపుపై కేంద్రం కీలక నిర్ణయం.. ఆ సిఫార్సులకు కేబినెట్ ఆమోదం..

ఎస్టోనియా

పురోగతి సాధించినట్టుగా భావించే ఐరోపా ఖండంలోని దేశంలోనూ ఈ పరిస్థితులు ఉన్నాయి. యూరప్‌లో అత్యల్ప వివాహ వయసు ఎస్టోనియాలో అమలు అవుతున్నది. ఈ దేశంలో తల్లిదండ్రుల అనుమతితో 15 ఏళ్ల టీనేజర్లు కూడా పెళ్లి చేసుకోవచ్చు. స్పెయిన్‌లో ఈ వయసు 14 ఏళ్లుగానే ఉండేది. కానీ, దీన్ని 16 ఏళ్లకు పెంచనున్నట్టు స్పానిష్ ప్రభుత్వం ప్రకటించింది.

యునైటెడ్ కింగ్‌డం
ఇంగ్లాండ్, వేల్స్‌లోని 18 ఏళ్ల నిండగానే పెళ్లి చేసుకోవచ్చు. లేదా తల్లిదండ్రుల అనుమతులతో 16 ఏళ్లు లేదా 17 ఏళ్లకూ పెళ్లి చేసుకోవచ్చు. అయితే, కొన్ని మత, సాంస్కృతిక విధానాల్లో ఇంత కంటే తక్కువ వయసులోనూ పెళ్లి చేసుకోవడాన్ని ఇక్కడి చట్టాలు నిషేధించడం లేదు. ఆ వివాహాలను స్థానిక ప్రభుత్వ కార్యాలయాలు ధ్రువీకరించవు.

ట్రినిడాడ్ టొబాగో
ఈ దేశంలో అధికారిక పెళ్లి వయసు 18 ఏళ్లు, ఆడవారికి, మగవారికి ఇదే వయసు పరిమితి. కానీ, ఇక్కడ హిందూ, ముస్లింలకు ప్రత్యేక చట్టాలు ఉన్నాయి. ఈ దేశంలో ముస్లిం చట్టాల ప్రకారం, ఆడపిల్లల 12 ఏళ్లకు, మగపిల్లలు 16 ఏళ్లకే వివాహం చేసుకోవచ్చు. కాగా, హిందువులైతే ఆడపిల్లలు 14 ఏళ్లకు, మగపిల్లలు 18 ఏళ్లకు పెళ్లి చేసుకోవడానికి అవకాశం ఉన్నది.

యునైటెడ్ స్టేట్స్
అమెరికాలో ఒక్కో రాష్ట్రం ఒక్కోలా పెళ్లి వయసును ధ్రువీకరిస్తున్నాయి. లేదా కామన్ లా‌నూ ఫాలో అవుతున్నాయి. చాలా రాష్ట్రాల్లో 18 ఏళ్లు పైబడినవారు పెళ్లి చేసుకోవడానికి అర్హులు. కానీ, నెబ్రాస్కాలో అధికారిక వివాహ వయసు 19 ఏళ్లు, మిస్సిస్సిపిలో 21ఏళ్లుగా ఉన్నది. కానీ, చాలా రాష్ట్రాల్లో మెజార్టీ వయస్సే.. పెళ్లి వయస్సుగా ఉన్నది. కానీ, అలబామాలో మెజార్టీ పొందడానికి వయసు 19 ఏళ్లుగా ఉంటే.. పెళ్లి వయసు 18 ఏళ్లుగా ఉన్నది. 

చైనా
చైనాలో పెళ్లి వయసుపై ఎప్పటి నుంచో పరిమితులు ఉన్నాయి. ప్రస్తుతం ఈ దేశంలో వివాహ వయసు పురుషులకు 22 ఏళ్లు.. మహిళలకు 20 ఏళ్లు. అయితే, ఈ వయసును తగ్గించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.  అధికారిక పెళ్లి వయసును 18 ఏళ్లకు తగ్గించాలనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. అధికారికంగానూ ఈ ప్రతిపాదనలు ఉన్నాయి. గత ఐదేళ్లుగా పెళ్లి ధ్రువీకరణలు చాలా వరకు తగ్గిపోయాయని, కాబట్టి, డెమోగ్రఫీని సంతులనం చేయడానికి పెళ్లి వయసును తగ్గించాల్సిన అవసరం ఉన్నదనే వాదనలు ఉన్నాయి. 

నైగర్‌లో బాల్య వివాహాలు లీగల్
నైగర్ దేశంలో బాల్య వివాహాలు లీగల్. ఇక్కడి సివిల్ కోడ్ ప్రకారం, పెళ్లికి కనీస వయసు బాయ్స్‌కు 18 ఏళ్లు.. గర్ల్స్‌కు 15 ఏళ్లుగా ఉన్నది. అయితే, ఇక్కడ చాలా పెళ్లిళ్లు చట్టాలకు కాకుండా సాంప్రదాయ నిబంధనలకు లోబడి జరుగుతుంటాయి. ఒక అంచనా ప్రకారం, ఈ దేశంలో 76 శాతం బాలికలు 18 ఏళ్లలోపే పెళ్లి చేసుకుంటారు. 28 శాతం బాలికలు 15 ఏళ్ల కంటే ముందే వివాహం చేసేసుకుంటున్నట్టు హ్యుమానియం స్టేట్ రిపోర్ట్ పేర్కొంది.  అందుకే ప్రపంచంలోనే అత్యధిక బాల్య వివాహాలు జరిగే దేశంగా దీనికి పేరుంది. నిరక్ష్యరాస్యత, పేదరికం, గ్రామీణ ప్రాంతాల్లో పెరిగిన వారిలో ఈ బాల్య వివాహాలు ఎక్కుగా జరుగుతున్నాయి.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Republic Day Parade: ఘనంగా గణతంత్ర దినోత్సవ పరేడ్ సన్నాహాలు| Asianet News Telugu
Fresh Snowfall in Shimla Delights Tourists: రికార్డు స్థాయిలో సిమ్లాలో మంచు వర్షం| Asianet Telugu