INDIA: లెఫ్ట్ సంచలన నిర్ణయం.. కేరళలో కాంగ్రెస్ పై పోటీ చేస్తామన్న ఏచూరి.. ముంబయి భేటీ వద్దే వ్యాఖ్యలు

Published : Sep 01, 2023, 05:36 PM IST
INDIA: లెఫ్ట్ సంచలన నిర్ణయం.. కేరళలో కాంగ్రెస్ పై పోటీ చేస్తామన్న ఏచూరి.. ముంబయి భేటీ వద్దే వ్యాఖ్యలు

సారాంశం

కేరళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీపై తాము పోటీ చేస్తామని సీపీఎం సెక్రెటరీ సీతారాం ఏచూరి స్పష్టం చేశారు. కేరళలో ఈ పోటీ సుస్పష్టమే అని, బెంగాల్‌లో మాత్రం టీఎంసీకి మద్దతు ఇస్తామని తెలిపారు. ముంబయి సమావేశం వద్దే సీతారాం ఏచూరి ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.  

ముంబయి: వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షాలన్నీ ఏకం కావాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నిర్ణయాన్ని వాస్తవరూపంలోకి తేవడానికి చర్చలు జరుగుతున్నాయి. పట్నా, బెంగళూరు తర్వాత ముంబయిలో సమావేశమయ్యారు. ప్రతిపక్షాల కూటమిలో కాంగ్రెస్, టీఎంసీ, శివసేన యూబీటీ, శరద్ పవార్ ఎన్సీపీ, సమాజ్‌వాదీ పార్టీ, ఆప్, ఆర్జేడీ, జేడీయూ, నేషనల్ కాన్ఫరెన్స్ సహా సుమారు రెండు డజన్ల పార్టీలు ఉన్న సంగతి తెలిసిందే. సీట్ల పంపకాల గురించి ఈ శిబిరంలో చర్చలు జరుగుతున్నాయి. ఈ సందర్భంలో ముంబయి సమావేశం వద్దే సీపీఎం సెక్రెటరీ జనరల్ సీతారాం ఏచూరి సంచలన వ్యాఖ్యలు చేశారు.

కేరళలో కాంగ్రెస్ పార్టీపై పోరాడుతామని సీతారం ఏచూరి చెప్పారు. ఇది తప్పదు.. అని తెలిపారు. కేరళలో సీపీఎం సారథ్యంలోని ఎల్డీఫ్ అధికారంలో ఉండగా.. కాంగ్రెస్ సారథ్యంలోని యూడీఎఫ్ ప్రతిపక్షంలో ఉన్నది. కేరళలో ఈ రెండు కూటమిల మధ్య ప్రధాన పోటీ ఉన్నది. ఈ నేపథ్యంలోనే సీతారాం ఏచూరి ఈ విషయాన్ని స్పష్టం చేశారు. 

ప్రతిపక్షాల ఐక్యత ప్రధానంగా సీట్ల పంపకాల చుట్టే ఉన్నది. ఆయా రాష్ట్రాల్లో బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలకే కూటమి మద్దతు ఇచ్చి గెలిపించుకోవాలని, ప్రాంతీయ పార్టీలు బలంగా లేని ప్రాంతాల్లో ఇతర పార్టీకి మిగిలిన పార్టీలన్నీ మద్దతు తెలుపాలనేది ప్రాథమిక అవగాహనగా ఉన్నది. ఇందులో భాగంగా పశ్చిమ బెంగాల్‌లో బలమైన ప్రాంతీయ పార్టీ, ప్రస్తుత అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్‌కు ఇండియా కూటమిలోని పార్టీలు మద్దతు ఇవ్వాలి. ఇందులో భాగంగా టీఎంసీకి ప్రధాన ప్రత్యర్థిగా గతంలో ఉన్న సీపీఎం పార్టీ కూడా ఇప్పుడు టీఎంసీకి మద్దతు ఇవ్వాల్సి వస్తున్నది. బెంగాల్‌లో టీఎంసీకి మద్దతు ఇస్తామన్న ఏచూరి.. కేరళలో మాత్రం కాంగ్రెస్ పై పోరాడుతామని ధ్రువీకరించారు.

Also Read: 

కేంద్ర ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని పలువురు విపక్ష పార్టీలు ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలోనే వేగంగా సీట్ల పంపకాలను పూర్తి చేసి.. వీలైనంత త్వరగా ప్రజల్లోకి వెళ్లే కార్యక్రమాలను నిర్వహించాలని ప్రతిపక్ష నేతలు భావిస్తున్నారు. బహుశా అక్టోబర్ మొదటి వారం నుంచే ప్రతిపక్షాలు ఉధృతంగా ప్రచారం చేయడం, పెద్ద పెద్ద సభలు నిర్వహించడం మొదలు పెట్టవచ్చని అంచనాలు వస్తున్నాయి.

PREV
click me!

Recommended Stories

Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్