G-20 సమ్మిట్ ఫుడ్ మెనూలో ఇండియన్ స్ట్రీట్​ ఫుడ్.. అతిథులకు అదిరిపోయే రుచితో స్పెషల్ వంటకాలు

Published : Sep 01, 2023, 05:36 PM IST
G-20 సమ్మిట్ ఫుడ్ మెనూలో ఇండియన్ స్ట్రీట్​ ఫుడ్.. అతిథులకు అదిరిపోయే రుచితో స్పెషల్ వంటకాలు

సారాంశం

G20 Summit: దేశ రాజధాని న్యూఢిల్లీ జీ 20 అనే ఓ బృహత్‌కార్యానికి వేదికగా మారనున్నది.  ఈ సమయంలో వచ్చే అతిథులకు, ప్రతినిధులకు ' గోలే గప్పే ', చాట్ వంటి భారతీయ వీధి ఆహారాల రుచి చూపించాలని ప్రభుత్వం భావిస్తుంది. అదే సమయంలో భారతదేశంలో డబ్బు లావాదేవీల వ్యవస్థను మార్చిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) ను కూడా వివరించాలని భావిస్తోంది. 

G20 Summit: G-20 శిఖరాగ్ర సమావేశం న్యూఢిల్లీలో సెప్టెంబర్ 9, 10 తేదీలలో జరుగుతుంది. ఈ సమావేశానికి దాదాపు 40 మంది దేశాధినేతలు,అధ్యక్షులు, ప్రధానులు, ముఖ్య పాలకులు హాజరకానున్నారు. అయితే.. అతిథి దేవోభవ అనే మన దేశంలో ఈ మహోన్నత కార్యక్రమం జరుగుతుండటంతో వచ్చే అతిథులకు ఎలాంటి లోటు జరుగుకుండా మోడీ సర్కార్ తగిన ఏర్పాటు చేస్తుంది. వచ్చే అతిథులకు  అందించే భోజన ఏర్పాట్లును కూడా ప్రత్యేక ద్రుష్టి సారించింది. 

ఈ తరుణలో జీ20 ఆపరేషన్స్ ప్రత్యేక కార్యదర్శి ముక్తేష్ కె పరదేశి మీడియాతో మాట్లాడుతూ పలు విషయాలను వెల్లడించారు. కన్వెన్షన్ సెంటర్‌లో క్యాటరింగ్‌ను ఐటీసీ ప్రముఖ హోటల్‌ చైన్‌ నిర్వహిస్తోందని తెలిపారు. వచ్చిన అతిథులకు వివిధ రకాల స్వదేశీ, విదేశీ వంటకాలను వడ్డించనున్నారనీ, ఇందులో ప్రధానంగా మిల్లెట్( చిరు ధాన్యాలు)తో చేసే వంటకాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు తెలిపారు. వివిధ రకాల ప్రాంతీయ వంటకాలను చేసేందుకు ప్రముఖ చెఫ్‌లను పిలిపించారనీ, వారు అతిథుల అభిరుచులకు తగినట్టుగా మెను ప్రిపేర్ చేయనున్నారని ప్రత్యేక కార్యదర్శి ముక్తేష్ కె పరదేశి తెలిపారు. 

అదే సమయంలో భారతదేశంలోని వీధి ఆహారాలకు(స్టీట్ పుడ్)ను కూడా వారికి పరిచయం చేయాలని అన్నారు. విదేశీ ప్రతినిధులు భారతదేశంలోని వివిధ ప్రాంతీయ వంటకాలను కూడా ఆస్వాదించాలంటున్నారు. వివిధ రకాల ధాన్యాలు, కూరగాయలు, పాల ఉత్పత్తులతో వినూత్నమైన వంటకాలను తయారు చేయడానికి చెఫ్‌లు సిద్దంగా ఉన్నారని తెలిపారు. ఈ సమయంలో దేశ వ్యాప్తంగా చాలా ఫేమస్ అయినా గోల్ గప్పే లేదా చాట్ ను అతిథులకు రుచి చూపాలని భావిస్తున్నామన్నారు.
  
G20 శిఖరాగ్ర సమావేశంలో భారతదేశ సంస్కృతి, వైవిధ్యమైన చేతిపనులు, విభిన్న వంటకాలను ప్రదర్శించడమే కాకుండా డిజిటల్ రంగంలో మన దేశం ఎలా పురోగతి సాధిస్తుందని, UPI చెల్లింపులు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి విదేశీ ప్రతినిధులు స్వయంగా తెలుసుకోవడానికి ఓ  ప్యానెల్‌లను రూపొందించనున్నట్లు సీనియర్ అధికారి తెలిపారు. డిజిటల్ చెల్లింపుల్లో భారతదేశం ఎలా ముందుంది. డిజిటల్ చెల్లింపుల రంగంలో భారతదేశం ఎలా దూసుకుపోతోందో, CoWin యాప్‌ను ఎలా అభివృద్ధి చేశారో, బిలియన్ మందికి పైగా ఆధార్‌తో ఎలా అనుసంధానించబడ్డారో ప్రతినిధులు కూడా తెలుసుకుంటారని ఆయన అన్నారు. 
 
భారతదేశాన్ని ప్రపంచాలకు మరో కోణంలో చూపించాలనీ, ప్రజాస్వామ్య మూలాల గల మన దేశంలో భాగస్వామ్య పాలన యొక్క భావన అని చాలా మందికి తెలియదనీ, ఆ మూలాలు ఇక్కడ ఉన్నాయి. వేల సంవత్సరాల క్రితమే మన దేశంలో సభ, సమితి అనే భావనలు ఉండేవనీ, ఆ మాలాలు ఆధారంగా ప్రజాస్వామ్య భావన బయటికి వచ్చిందని అన్నారు. భారతదేశంలో ప్రజాస్వామ్య మూలాలను చాటిచెప్పేందుకు 'భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లి' అనే పేరుతో ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
 
న్యూఢిల్లీ ఎయిర్‌పోర్టులో విశాలమైన పార్కింగ్ స్థలం ఉందని ఆయన చెప్పారు. తాము GMRతో సంప్రదింపులు జరుపుతున్నామనీ, పాలెం టెక్నికల్ ఏరియా, ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. భారత్ గతేడాది డిసెంబర్ 1న G20 అధ్యక్ష పదవిని చేపట్టింది. ఈ క్రమంలో G20కి సంబంధించిన సుమారు 200 సమావేశాలు దేశవ్యాప్తంగా 60 నగరాల్లో నిర్వహించబడ్డాయనీ, దేశ సంస్థాగత నైపుణ్యాలను ప్రతిబింబించేలా రాజకీయ నాయకత్వ ఆదేశాలను ఆయన ప్రస్తావించారు. మనం G20 ముఖ్యమైన ఎజెండాను ప్రచారం చేయడంలోనే కాకుండా, సంస్థాగత నైపుణ్యాలు, లాజిస్టికల్ బలాల విషయంలో భారతదేశం వెనుకబడి లేదని ప్రపంచానికి చాటిచెప్పాలనీ, ఈ విషయాన్ని సందర్శించే దేశాల ప్రతినిధులందరూ గుర్తించాలని తాను భావిస్తున్నానని తెలిపారు. వారికి మన ఆతిథ్యాన్ని అందించాలని భావిస్తున్నామని అన్నారు. ఇప్పటివరకు జరిగిన 200 సమావేశాలన్నీ ఎలాంటి పొరపాట్లు లేకుండా జరిగాయనీ. ఎటువంటి అనివార్య సంఘటన జరగలేదని ఆయన  చెప్పాడు.

కాబట్టి రాబోయే G20 సమ్మిట్ కూడా ఎటువంటి అవాంతరాలు లేకుండా అద్భుతంగా జరుగుతాయని తాము ఆశిస్తున్నామనీ, తాము మీటింగ్‌ను చాలా ఎక్కువ ఆప్యాయతతో,ఆతిథ్యంతో నిర్వహించాలనుకుంటున్నామని పేర్కొన్నారు. వచ్చిన అతిథులను జాగ్రత్తగా చూసుకోవడంతో పాటు.. భారతదేశం నాగరికత, సాంస్కృతిక ప్రదేశాలను పరిచయం చేయాలని భావిస్తున్నామని అన్నారు. సాంకేతికంగా భారత్ ఎలా  అభివృద్ధి చెందుతుందో, మరో 25 ఏళ్లలో మన దేశ ప్రణాళికలు, దేశ సామర్థ్యాలను వివరించాలని పరదేశి అన్నారు. 

న్యూఢిల్లీలో జరిగే 18వ G20 సమ్మిట్ లో దేశాధినేతలు, మంత్రులు, సీనియర్ అధికారులు, సివిల్ సొసైటీల మధ్య ఏడాది పొడవునా జరిగిన సమావేశాల చర్చ.సంబంధిత మంత్రివర్గ, కార్యవర్గ సమావేశాలలో చర్చించి అంగీకరించిన ప్రాధాన్యతల పట్ల నాయకుల నిబద్ధతను తెలుపుతూ.. న్యూఢిల్లీ సమ్మిట్ ముగింపులో G20 నాయకుల డిక్లరేషన్ ఆమోదించబడుతుంది.

PREV
click me!

Recommended Stories

Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్