Delay In Indigo Flights:  లేటుగా న‌డుస్తున్న ఇండిగో విమానాలు.. సీరియ‌స్ అయిన DGCA.. కార‌ణ‌మ‌దేనా ?

By Rajesh KFirst Published Jul 4, 2022, 12:16 AM IST
Highlights

Delay In Indigo Flights: దేశవ్యాప్తంగా విమానయాన సంస్థ ఇండిగో విమానాలు శనివారం ఆలస్యంగా న‌డిచాయి. ఈ విషయంపై  డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) సీరియ‌స్ అయ్యింది. ఈ స‌మ‌స్యపై వివ‌ర‌ణ ఇవ్వాల్సింది ఆదేశించింది. 

Delay In Indigo Flights: దేశవ్యాప్తంగా పలు ఇండిగో విమానాలు(Indigo Flights) శ‌నివారం ఆలస్యంగా నడిచాయి. దీంతో పలువురు ప్ర‌యాణీకులు తీవ్రంగా ఇబ్బందులు గురయ్యారు. అయితే.. ఈ ఆల‌స్యానికి గ‌ల కారణాలు తెలియరాలేదు. దీంతో డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ఈ విష‌యాన్ని తీవ్రంగా పరిగణించింది. ఇందుకు సంబంధించి వివ‌ర‌ణ ఇవ్వాల్సిందిగా.. Indigo Flightsవిమానయాన సంస్థకు  DGCA  నోటీసు జారీ చేసింది.  

గత కొన్నిరోజులుగా.. ఇండిగో విమానాలు నిర్ణీత సమయం కంటే ఆలస్యంగా నడుస్తున్నాయి. అయితే, విమానయాన సంస్థలో తగిన సంఖ్యలో పైలట్లు లేకపోవడమే విమానం ఆలస్యం కావడానికి కారణమని వర్గాల సమాచారం. దీని కారణంగా.. చాలా విమానాలు.. నిర్ణయించిన సమయంలో టేకాఫ్ కాలేదు. వాస్తవానికి..  చాలా మంది సిబ్బంది సిక్ లీవ్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఎయిర్ ఇండియా నిర్వ‌హించిన ఉద్యోగాల ఇంటర్వ్యూ కు వెళ్ళినందున సిబ్బంది సంఖ్య తగ్గింది.
 
సమాచారం ప్రకారం.. సిబ్బందిలో చాలా మంది అనారోగ్యం పేరుతో సెలవు తీసుకొని ఎయిర్ ఇండియా (AI) రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లో పాల్గొనడానికి వెళ్లారు. దీనిపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) చీఫ్ అరుణ్ కుమార్‌ను ఆదివారం ప్రశ్నించగా, ఈ అంశాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు.
 
ఇండిగో దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థ. ఈ సంస్థ ప్రతిరోజూ సుమారు 1,600 దేశీయ, అంతర్జాతీయ విమానాలను నడుపుతోంది. అయితే.. ఎయిరిండియాలో రెండో దశ ఉద్యోగ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ శనివారం జరిగినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఎయిరిండియా ఎయిర్‌లైన్ ఇంటర్వ్యూ హాజ‌రు కావ‌డానికి ప‌లువురు సిబ్బంది అనారోగ్యం పేరుతో సెలవు తీసుకున్నట్టు తెలుస్తుంది. 

ఇతర కంపెనీల విమానాలు కూడా ఆలస్యం అవుతున్నాయా?

DGCA వెబ్‌సైట్ ప్రకారం.. శనివారం నాడు ఇండిగో దేశీయ విమానాలలో 45.2 శాతం విమానాలు మాత్ర‌మే
సమయానికి నడపబడ్డాయి.  ఇత‌ర విమాన సంస్థ‌ల‌తో పోల్చితే..  ఎయిర్ ఇండియా 77.1 శాతం,  స్పైస్ జెట్ 80.4 శాతం, విస్తారా 86.3 శాతం, గో ఫస్ట్ 88 శాతం, ఎయిర్ ఏషియా ఇండియా  92.3 శాతం విమానాలు సమయానికి నడపబడ్డాయి. 
 

click me!