కూతురిపై తల్లి గృహ హింస కేసు.. ఎక్కువ మంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారంటూ..

By telugu news teamFirst Published Apr 9, 2021, 8:47 AM IST
Highlights

తల్లి.. కూతురిపై గృహ హింస కేసు పెట్టింది. ఈ కేసు కారణంగా యువతికి విదేశాలకు వెళ్లడం కష్టంగా మారింది. దీంతో.. ఆ కేసుని కొట్టివేయాలంటూ యువతి బాంబే హైకోర్టును ఆశ్రయించింది.

గృహ హింస కేసులో.. ఓ మహిళ ఆరోపణలు ఎదుర్కొంటుండగా.. సదరు మహిళ ను కించపరుస్తూ లాయర్ చేసిన కామెంట్స్.. కోర్టు కి ఆగ్రహం తెప్పించాయి.  సదరు యువతిపై సొంత తల్లే ఈ గృహ హింస కేసు పెట్టడం గమనార్హం. ఈ సంఘటన ముంబయిలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఇంతకీ మ్యాటరేంటంటే... ముంబయికి చెందిన ఇద్దరు తళ్లీ కూతుళ్లు. కూతరు త్వరలో ఉన్నత విద్య కోసం ఆస్ట్రేలియా వెళ్లాలనఅ నుకుంది. ఈ క్రమంలో.. తల్లి.. కూతురిపై గృహ హింస కేసు పెట్టింది. ఈ కేసు కారణంగా యువతికి విదేశాలకు వెళ్లడం కష్టంగా మారింది. దీంతో.. ఆ కేసుని కొట్టివేయాలంటూ యువతి బాంబే హైకోర్టును ఆశ్రయించింది.

జస్టిస్ ఎస్ఎస్ షిండే, మనీశ్ పిటాలేతో కూడిన డివిజన్ బెంచ్ ఈ పిటిషన్‌ను విచారించింది. మహిళ తరపు న్యాయవాది కెన్నీ ఠక్కర్ మాట్లాడుతూ.. ఉన్నత విద్య అభ్యసించేందుకు పిటిషనర్ ఆస్ట్రేలియా వెళ్లాల్సి ఉందని కోర్టుకు తెలిపారు. కాబట్టి ఫిర్యాదును కొట్టివేయాలని కోరారు. పిటిషనర్ తల్లి తరపు న్యాయవాది ఆయన అభ్యర్థనను వ్యతిరేకించారు. పిటిషర్‌కు చాలామంది బాయ్‌ఫ్రెండ్స్ ఉన్నారని కోర్టుకు తెలిపారు. 

వెంటనే కల్పించుకున్న జస్టిస్ పాటిల్ ఆయనను మందలించారు. ఇలాంటి వాదనలు ఆపేయాలని కోరారు. ‘‘ఇదెక్కడి వాదన? ఇది (పిటిషనర్) జీవితానికి సంబంధించినది. ఆమెకు చాలామంది బాయ్‌ఫ్రెండ్స్ ఉన్నారనడమేంటి. లా పాయింట్‌పై మాట్లాడండి’’ అని మందలించారు. పిటిషనర్ చాలా దూరం వెళ్తున్నారని, కాబట్టి తల్లి సంతోషంగా ఉండాలని కోర్టు పేర్కొంది. ఈ కేసుకు సంబంధించిన తీర్పును ఈ నెల 19న వెలువరించనున్నట్టు ధర్మాసనం పేర్కొంది.

click me!