రేప్ కేసులపై రవిశంకర్ ప్రసాద్ వినతి: విభేదించిన సుప్రీం ప్రధాన న్యాయమూర్తి

By telugu teamFirst Published Dec 7, 2019, 3:47 PM IST
Highlights

రేప్ కేసులను త్వరగా పరిష్కరించాలనే కేంద్ర న్యాయశాఖమ ంత్రి రవిశంకర్ ప్రసాద్ తో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బాబ్డే విభేదించారు. రవిశంకర్ చెప్పినట్లు రేప్ కేసుల్లో వెంటనే తీర్పు చెప్పడం సాధ్యం కాదని బాబ్డే అన్నారు.

న్యూఢిల్లీ: రేప్ కేసుల విషయంలో కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ చేసిన విజ్ఞప్తితో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బాబ్డే విభేదించారు. అత్యాచారం కేసులను త్వరగా పరిష్కరించాలని రవిశంకర్ ప్రసాద్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇతర సీనియర్ న్యాయమూర్తులకు ఆయన విజ్ఞప్తి చేశారు. దానిపై బాబ్డే ప్రతిస్పందించారు. రేప్ కేసుల విషయంలో వెంటనే తీర్పు చెప్పడం సరి కాదని ఆయన అన్నారు. 

ఎన్ కౌంటర్లపై బాబ్డే పరోక్ష వ్యాఖ్యలు చేశారు న్యాయం అనేది ప్రతీకారంగా మారితే న్యాయం రూపురేఖలు మారిపోతాయని ఆయన అన్నారు. రేప్ కేసుల్లో త్వరగా తీర్పు చెప్పాలని రవిశంకర్ ప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై ఆయన ఆసక్తికమైన వ్యాఖ్యలు చేశారు.  

దేశంలోని మహిళలు వేదనతో, నిస్పృహతో ఉన్నారని, అందువల్ల రేప్ కేసులను త్వరగా పరిష్కరించేందుకు ఓ యంత్రంగా ఉండాలని రవిశంకర్ ప్రసాద్ అన్నారు.  సత్వర న్యాయం కోసం మహిళలు కేకలు వేస్తున్నా ఆయన అన్నారు. 

తీవ్రమైన కేసుల పరిష్కారం కోసం 704 ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఉన్నాయని, పొక్సో, రేప్ కేసుల్లో తీర్పు పరిష్కారానికే ప్రభుత్వం మరో 1,123 ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేస్తామని ఆయన అన్నారు. 

click me!