హెలికాఫ్టర్ ప్రమాదంపై త్రివిధ దళాల సంయుక్త దర్యాప్తు.. పార్లమెంట్‌లో ప్రకటన చేసిన మంత్రి రాజ్‌నాథ్ సింగ్

By Sumanth KanukulaFirst Published Dec 9, 2021, 11:45 AM IST
Highlights

హెలికాఫ్టర్‌ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ (Gen Bipin Rawat) , ఆయన సతీమణి మధులికా రావత్, ఇతర సీనియర్ అధికారులకు పార్లమెంట్‌ ఉభయసభలలో శ్రద్దాంజలి ఘటించారు. ఈ ఘటనపై త్రివిధ దళాల సంయుక్త దర్యాప్తు చేపట్టనున్నట్టుగా రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ (Defence Minister Rajnath Singh) సింగ్ తెలిపారు.

హెలికాఫ్టర్‌ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ (Gen Bipin Rawat) , ఆయన సతీమణి మధులికా రావత్, ఇతర సీనియర్ అధికారులకు పార్లమెంట్‌ ఉభయసభలలో శ్రద్దాంజలి ఘటించారు. వారి మృతిపట్ల ఉభయసభలు సంతాపం వ్యక్తం చేశాయి. లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.ఈ ప్రమాదానికి సంబంధించి తొలుత లోక్‌సభలో, తర్వాత రాజ్యసభలో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ (Defence Minister Rajnath Singh) సింగ్ ప్రకటన చేశారు. బుధవారం ఉదయం 11.48 గంటలకు సూలురు ఎయిర్ బేస్ నుంచి బయలుదేరిన హెలికాఫ్టర్‌కు.. మధ్యాహ్నం 12.08 గంటలకు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో సంకేతాలు నిలిచిపోయాయని చెప్పారు. భారీ శబ్దం రావడంతో స్థానికకులు అక్కడికి వెళ్లారని తెలిపారు. స్థానికులు అక్కడికి చేరుకుని సరికి హెలికాఫ్టర్ మంట్లో ఉందని చెప్పారు. 

జనరల్ బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులికా రావత్‌తో మొత్తం 13 మంది మరణించినట్టుగా చెప్పారు. మృతుల భౌతికకాయాలను నేడు ఢిల్లీకి తీసుకురానున్నట్టుగా రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ రావత్ అంత్యక్రియను పూర్తి సైనిక గౌరవాలతో నిర్వహించనున్నట్టుగా చెప్పారు. మరణించిన వ్యక్తులకు నివాళులర్పిస్తున్నట్టుగా చెప్పారు. మృతుల కుటుంబాలకు సంతాపాన్ని తెలియజేశారు.

గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ వెల్లింగ్టన్‌లోని మిలటరీ హాస్పిటల్‌లో లైఫ్ సపోర్ట్‌పై చికిత్స పొందుతున్నట్టుగా రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. అతని ప్రాణాలను రక్షించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్టుగా చెప్పారు.

Alos read: Bipin Rawat: హెలికాఫ్టర్ ప్రమాద స్థలంలో Black box స్వాధీనం చేసుకన్న అధికారులు.. అసలు బ్లాక్ బాక్స్ అంటే ఏమిటి?


విచారణ కొనసాగుతుంది..
‘మిలటరీ హెలికాప్టర్ ప్రమాదంపై భారత వైమానిక దళం (IAF) త్రివిధ దళాల సంయుక్త దర్యాప్తు విచారణకు ఆదేశించింది. ఎయిర్ మార్షల్ మానవేంద్ర సింగ్ (Air Marshal Manavendra Singh) నేతృత్వంలో దర్యాప్తు జరుగుతుంది. విచారణ బృందం నిన్ననే వెల్లింగ్‌టన్‌కు చేరుకుని దర్యాప్తు ప్రారంభించింది’ అని రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు.


అసలేం జరిగింది..
నీలగిరి జిల్లా వెల్లింగ్టన్‌లోని డిఫెన్స్‌ సర్వీసెస్‌ స్టాఫ్‌ కళాశాలలో సిబ్బంది, శిక్షణలో ఉన్న అధికారులను ఉద్దేశించి జనరల్‌ బిపిన్ రావత్‌ బుధవారం ప్రసంగించాల్సి ఉంది. ఇందుకోసం భార్య మధులిక రావత్, మరికొంతమంది సైనిక ఉన్నతాధికారులతో కలిసి ఆయన ఢిల్లీ నుంచి బుధవారం ఉదయం తమిళనాడు బయలుదేరారు. బుధవారం ఉదయం 11.34 గంటలకు కోయంబత్తూరు జిల్లా సూలూర్‌‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి 11:48 గంటలకు భారత వాయుసేనకు చెందిన ఎంఐ-17వీ5 హెలికాప్టర్‌లో వెల్లింగ్టన్‌కు బయలుదేరారు. అయితే మధ్యాహ్నం 12.20 గంటల ప్రాంతంలో హెలికాఫ్టర్ కున్నూరు సమీపంలో కూలిపోయింది. ఈ ప్రమాందలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ (Gen Bipin Rawat), ఆయన భార్య మధులికా రావత్ (Madhulika Rawat) సహా 13 మంది మృతి చెందారు. గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ (group captain varun singh) ఒక్కరే ప్రాణాలతో బయటపడ్డారు. ఆయనకు ప్రస్తుతం వెల్లింగ్టన్‌లోని సైనిక ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది.

click me!