దేశ ఆర్ధిక వ్యవస్థ క్రమంగా పుంజుకొంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పారు.కరోనాపై యుద్దానికి కొత్తదారులను అన్వేషిస్తున్నామన్నారు.
న్యూఢిల్లీ: దేశ ఆర్ధిక వ్యవస్థ క్రమంగా పుంజుకొంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పారు.కరోనాపై యుద్దానికి కొత్తదారులను అన్వేషిస్తున్నామన్నారు.
ఆదివారం నాడు మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగించారు. దేశ ప్రజలంతా కరోనాపై పోరాటం చేస్తున్నారని ఆయన గుర్తు చేశారు. ఈ సమయంలో మనం మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. అన్ని రంగాలు కరోనా వల్ల ఇబ్బందులు పడుతున్నాయని ఆయన చెప్పారు.
also read:ఇండియాపై కరోనా పంజా: 24 గంటల్లో 8,380 కేసులు, మొత్తం 1.8లక్షలకు చేరిక
కరోనా వల్ల బాగా ఇబ్బంది పడింది వలసకూలీలే అని ఆయన గుర్తు చేశారు. దేశం వలస కూలీలకు అండగా నిలిచిందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వలస కూలీలకు అండగా నిలిచాయని చెప్పారు. ఆత్మ నిర్భర బారత్ దిశగా మనం అడుగులు వేస్తున్నామన్నారు పీఎం.
రైల్వే సిబ్బంది కూడా కోవిడ్ వారియర్స్ అని ఆయన చెప్పారు. కోవిడ్ వీరులు అవిశ్రాంతంగా పనిచేస్తున్నారన్నారు. ప్రపంచం మన ఆయుర్వేద, యోగ గురించి తెలుసుకొంటున్నాయన్నారు.
యోగా మనిషిలో ఇమ్యూనిటీని పెంచుతోందన్నారు. ఆయుష్మాన్ భారత్ విప్లవాత్మక పథకంగా ప్రధాని మోడీ అభివర్ణించారు. నిరుపేదలకు ఆయుష్మాన్ భారత్ వరంగా మారిందన్నారు.మిడతల దాడులతో పంటలు కోల్పోయిన రైతులను ఆదుకొంటామని ప్రధాని మోడీ హామీ ఇచ్చారు.