ల్యాండ్ ఫర్ జాబ్ స్కామ్ కేసు.. బీహార్ మాజీ సీఎం రబ్రీ దేవీ ఇంటికి చేరుకొని విచారణ జరపుతున్న సీబీఐ..

Published : Mar 06, 2023, 12:59 PM IST
ల్యాండ్ ఫర్ జాబ్ స్కామ్ కేసు.. బీహార్ మాజీ సీఎం రబ్రీ దేవీ ఇంటికి చేరుకొని విచారణ జరపుతున్న సీబీఐ..

సారాంశం

ల్యాండ్ ఫర్ జాబ్ స్కామ్ కేసు విచారణలో భాగంగా సీబీఐ అధికారులు బీహార్ మాజీ సీఎం రబ్రీ దేవీ నివాసానికి చేరుకున్నారు. 12 మంది అధికారులతో కూడిన బృందం ఆమెను ప్రశ్నిస్తోంది. ఈ సమయంలో డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ కూడా ఇంట్లోనే ఉన్నారు. 

బీహార్ మాజీ సీఎం రబ్రీ దేవీ ఇంటికి 12 మంది సభ్యులతో కూడిన సీబీఐ బృందం సోమవారం ఉదయం చేరుకుంది. ఆ సమయంలో బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ కూడా ఇంట్లోనే ఉన్నారు. ల్యాండ్ ఫర్ జాబ్ స్కామ్ కేసులో సీబీఐ అధికారులు రబ్రీ దేవి ఇంట్లో ఆమెను విచారిస్తున్నారు. ఈ కేసులో ఆమెతో పాటు, భర్త లాలూ ప్రసాద్ యాదవ్ తో పాటు మరో 14 మంది ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. 

బ్రిటీష్ పాలన కంటే ముందే భారత్ లో 70 శాతం మంది చదువుకున్నారు - ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్

ల్యాండ్ ఫర్ జాబ్ స్కామ్ కేసులో లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీదేవి, వారి కుమార్తె మీసా భారతితో పాటు మరో 13 మందిపై సీబీఐ గత ఏడాది అక్టోబర్ 7న చార్జిషీట్ దాఖలు చేసింది. రౌస్ అవెన్యూలోని సీబీఐ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసినట్లు సీబీఐ తెలిపింది.

ల్యాండ్ ఫర్ జాబ్ స్కామ్ లేదా ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) కుంభకోణం కేసులో భారతీయ రైల్వేలో రిగ్గింగ్ జరిగిందని, భూమికి బదులుగా ఉద్యోగాలు కల్పించారని ఆరోపణలు ఉన్నాయి. యూపీఏ-1 ప్రభుత్వంలో రైల్వే మంత్రిత్వ శాఖకు నేతృత్వం వహించిన సమయంలో 74 ఏళ్ల లాలూ ప్రసాద్ యాదవ్ ఢిల్లీ ల్యాండ్ అండ్ ఫైనాన్స్ (డీఎల్ఎఫ్)కు పలు కీలక ప్రాజెక్టులను జారీ చేశారని సీబీఐ పేర్కొంది. ముంబైలోని బాంద్రాలో ల్యాండ్ లీజు ప్రాజెక్టులు, న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ పునర్నిర్మాణం వంటి పలు రైల్వే ప్రాజెక్టులకు బదులుగా డీఎల్ఎఫ్ గ్రూప్ నుంచి దక్షిణ ఢిల్లీలో కోట్లాది రూపాయల విలువైన ఆస్తిని పొందారని సీబీఐ ఆరోపించింది.

విమానంలో మూత్ర విసర్జన కేసు : సోదరి పెళ్లి కోసం భారత్ కు వస్తూ తోటి ప్రమాణికుడిపై యూరినేట్..

గత నెలలో ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన భార్య రబ్రీదేవితో పాటు మరో 14 మందికి సమన్లు జారీ చేసింది. లాలూ కుమార్తె మీసా భారతికి కూడా కోర్టు సమన్లు జారీ చేసింది. నిందితులపై సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్ ను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు ఈ నెల 15వ తేదీకి సమన్లు జారీ చేసింది. లాలూ యాదవ్ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో భూములకు బదులుగా ఉద్యోగాలు కల్పించారని చార్జిషీట్ లో పేర్కొన్నారు.

దారుణం.. వీధికుక్కలు వెంటపడడంతో బండిమీదినుంచి జారిపడి 55 యేళ్ళ మహిళ మృతి..

ఆరోపణలు రుజువు చేసే బలమైన ఆధారాలు లభించకపోవడంతో లాలూప్రసాద్ యాదవ్, ఆయన కుటుంబ సభ్యులపై సీబీఐ 2021లో కేసును మూసివేసింది. అయితే గత ఏడాది డిసెంబర్ లో మాజీ ముఖ్యమంత్రిపై ఉన్న అవినీతి కేసులను మళ్లీ తెరిచారు. కాగా.. పాట్నా నివాసంలో విచారణ అనంతరం రబ్రీ దేవిని తదుపరి విచారణ కోసం సీబీఐ కార్యాలయానికి పిలిపించే అవకాశం ఉంది.
 

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?