అసభ్యరీతిలో మాజీ గర్ల్ ఫ్రెండ్ ఫోటోలు.. ఫోన్ అమ్మేయడంతో..

Published : May 27, 2019, 03:10 PM IST
అసభ్యరీతిలో మాజీ గర్ల్ ఫ్రెండ్ ఫోటోలు.. ఫోన్ అమ్మేయడంతో..

సారాంశం

ప్రేమలో ఉన్నప్పుడు ఆ యువతి తన ఫోటోలను బాయ్ ఫ్రెండ్ తో షేర్ చేసుకుంది. ఆ తర్వాత ఆ ప్రేమ మధ్యలోనే ఆగిపోయింది. ఆమె మరొకరికి ఇల్లాలు అయ్యింది. పెళ్లై కుమారుడు కూడా ఉన్న సమయంలో.. ఆమె అసభ్యకరమై ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. 

ప్రేమలో ఉన్నప్పుడు ఆ యువతి తన ఫోటోలను బాయ్ ఫ్రెండ్ తో షేర్ చేసుకుంది. ఆ తర్వాత ఆ ప్రేమ మధ్యలోనే ఆగిపోయింది. ఆమె మరొకరికి ఇల్లాలు అయ్యింది. పెళ్లై కుమారుడు కూడా ఉన్న సమయంలో.. ఆమె అసభ్యకరమై ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. దీంతో... ఆమె కుమారుడితో సహా ఆత్మహత్యకు పాల్పడింది. కాగా ఆమె కుమారుడు మాత్రం ప్రాణపాయ స్థితి నుంచి బయటపడ్డాయి. ఈ దారుణ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ముజఫర్ నగర్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే...ముజఫర్ నగర్ ప్రాంతానికి చెందిన మహిళ కొన్నేళ్ల క్రితం మీరట్ కి చెందిన శుభమ్ కుమార్ ని ప్రేమించింది. ఆ సమయంలో అతనితో కలిసి ఫోటోలు దిగింది. ఆ అభ్యంతరకరంగా ఉన్న ఫోటోలను డిలీట్‌ చేయకుండా అదే పట్టణానికి చెందిన మరొకరికి తన మొబైల్‌ ఫోన్‌ను విక్రయించాడు. ఈ ఫోటోలను ఫోన్‌ కొనుగోలు చేసిన వ్యక్తి ప్రజాపతి సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో అవి వైరల్‌గా మారాయి.

దీంతో తీవ్రంగా కలతచెందిన బాధితురాలు ముజఫర్‌నగర్‌లోని ఖతౌలి బ్రిడ్జిపై నుంచి ఐదేళ్ల కుమారుడితో సహా కిందకి దూకారు. ఆత్మహత్య చేసుకునే ముందు మహిళ తన భర్తతో చివరిసారిగా ఫోన్‌లో మాట్లాడినట్టు పోలీసులు గుర్తించారు. కాగా, శుభమ్‌ అతని స్నేహితులు కలిసి ఫోటోలను షేర్‌ చేసిన ప్రజాపతిని మే 23న హత్య చేసినట్టు పోలీసులు వెల్లడించారు.

కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసిన పోలీసులు శుభమ్ ని అతని స్నేహితులను అరెస్టు చేశారు. 

PREV
click me!

Recommended Stories

Women Safety Apps : అమ్మాయిలూ.. మీ ఫోన్లో ఈ యాప్స్ లేకుంటే అరిచి గోలచేసినా లాభం ఉండదు
Assembly Building Shines in Tricolour Laser Lights | Republic Day Celebrations | Asianet News Telugu