గడ్డి కుంభకోణం కేసు.. కోర్టులో లొంగిపోయిన లాలూ ప్రసాద్ యాదవ్

By sivanagaprasad KodatiFirst Published Aug 30, 2018, 1:26 PM IST
Highlights

గడ్డి కుంభకోణం కేసులో దోషిగా తేలిన బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఇవాళ రాంచీలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఎదుట లొంగిపోయారు.

గడ్డి కుంభకోణం కేసులో దోషిగా తేలిన బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఇవాళ రాంచీలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఎదుట లొంగిపోయారు. 1995-96 మధ్య కాలంలో దుంకా ట్రజరీ నుంచి రూ.3.13 కోట్ల నిధుల దుర్వినియోగం కేసులో కేసు నమోదైంది.

16 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా సాగిన విచారణలో లాలూ సహా 45 మందిని రాంచీలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం దోషులుగా పేర్కొంది. ఈ కేసులో లాలూకి ఏడేళ్ల శిక్షను విధించింది. అయితే అనారోగ్య కారణాలతో బాధపడుతున్న లాలూ చికిత్స చేయించుకునేందుకు గానూ న్యాయస్థానం మూడు నెలల పాటు పెరోల్‌ మంజూరు చేసింది.

ఈ కాలంలో బహిరంగ కార్యక్రమాలు, రాజకీయ కార్యక్రమాలు, మీడియా సమావేశాల్లో పాల్గొనకూడదని ఆదేశించింది. ఇవాళ్టీతో గడువు ముగియడంతో లాలూ మద్ధతుదారులు, పార్టీ కార్యకర్తలు వెంటరాగా న్యాయస్థానంలో లొంగిపోయారు. 

click me!