అక్షర్‌ధామ్‌ను సందర్శించిన యూఎస్ కాంగ్రెస్ ప్రతినిధుల బృందం.. వాస్తుకళకు ఫిదా

Siva Kodati |  
Published : Aug 15, 2023, 06:05 PM ISTUpdated : Aug 15, 2023, 06:11 PM IST
అక్షర్‌ధామ్‌ను సందర్శించిన యూఎస్ కాంగ్రెస్ ప్రతినిధుల బృందం.. వాస్తుకళకు ఫిదా

సారాంశం

యూఎస్ కాంగ్రెస్ ప్రతినిధుల బృందం ఢిల్లీలోని ప్రఖ్యాత స్వామినారాయణ్ అక్షర్‌‌ధామ్ ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అభిషేకం కార్యక్రమంలో వారు  పాల్గొన్నారు. అక్కడి వాస్తు, శిల్ప కళకు వారు ముగ్ధులయ్యారు

కాంగ్రెస్‌మెన్ రో ఖన్నా (CA-17), కాంగ్రెస్‌మెన్ మైఖేల్ వాల్ట్జ్ (FL-06) నేతృత్వంలోని అమెరికా కాంగ్రెస్ ప్రతినిధి బృందం, భారతదేశం మరియు ఇండో అమెరికన్లపై ద్వైపాక్షిక కాంగ్రెషనల్ కాకస్ సహ-అధ్యక్షులు భారత స్వాతంత్య్ర వేడుకలకు హాజరైన సంగతి తెలిసిందే. పర్యటనలో భాగంగా వారు న్యూఢిల్లీలోని ప్రసిద్ధ స్వామినారాయణ ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, సిబ్బంది యూఎస్ ప్రతినిధి బృందానికి ఘన స్వాగతం పలికారు. 

 

 

ఈ ప్రతినిధి బృందంలో కాంగ్రెస్ వుమెన్ డెబోరా రాస్ (NC-2) , కాంగ్రెస్ వుమెన్ కాట్ కమ్మక్ (FL-3)‌లకు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు . అనంతరం ఈ ప్రతినిధి బృందం స్వామినారాయణ్ అక్షరధామ్ మందిర్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దాని కళ , వాస్తుశిల్పాన్ని మెచ్చుకున్నారు. అలాగే ఆలయ నిర్మాణం, ఇతర ఆధ్యాత్మిక విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఇదే సమయంలో యూఎస్ కాంగ్రెస్ ప్రతినిధి బృందం 'అభిషేకం' కూడా నిర్వహించింది. భారతీయ ఆచారాలు , సంప్రదాయాల పట్ల తమకున్న గౌరవాన్ని వారు చాటుకున్నారు. 

 

 

తమకు లభించిన ఆతిథ్యం పట్ల భారత సంతతికి చెందిన కాంగ్రెస్ సభ్యుడు రో ఖన్నా అక్షరధామ్ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ పర్యటన భారత్, అమెరికాల మధ్య స్నేహ బంధాలను బలోపేతం చేసిందని రో ఖన్నా అన్నారు. అలాగే సాంస్కృతిక మార్పిడి యొక్క ప్రాముఖ్యతను ఆయన ప్రస్తావించారు.

 

 

మరో కాంగ్రెస్ సభ్యుడు మైఖేల్ వాల్ట్జ్ స్పందిస్తూ.. స్వామినారాయణ అక్షరధామ్‌ సందర్శన ఒక అద్భుతమైన అనుభవమన్నారు. ఇది భారతదేశ సాంస్కృతిక , ఆధ్యాత్మిక మూలాలపై మాకున్న అవగాహనను మరింత పెంచిందని వాల్ట్జ్ అన్నారు. సాదరమైన ఆదరణ, పవిత్ర ఆచారాలలో పాల్గొనే అవకాశం మా ప్రతినిధి బృందంపై శాశ్వతమైన ముద్ర వేసిందని వాల్ట్జ్ పేర్కొన్నారు. 

 

 

కాగా.. స్వామినారాయణ్ అక్షరధామ్ భారతీయ కళలు, సంస్కృతి , ఆధ్యాత్మికతకు నిదర్శనంగా పనిచేస్తోంది. ప్రపంచం నలుమూలల నుండి మిలియన్ల మంది సందర్శకులను ఇది ఆకర్షిస్తుంది. యునైటెడ్ స్టేట్స్ కాంగ్రెస్ ప్రతినిధుల పర్యటన ద్వారా భారత్ - అమెరికాల మధ్య పరస్పర సాంస్కృతిక సంబంధాలు , అవగాహనను పెంపొందించడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుందని విశ్లేషకులు అంటున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Reliance Jio : అంబానీ మామ న్యూఇయర్ గిప్ట్ ...జియో యూజర్స్ కి రూ.35,100..!
Coldest Places in India : మైనస్ 50°C ఉష్ణోగ్రతలా..! అత్యంత చలిగావుండే టాప్ 5 ప్రదేశాలివే