lakhimpur kheri: ఆశిష్ మిశ్రాను ఎందుకు అరెస్ట్ చేయలేదు,పోలీసులపై సుప్రీం సీరియస్

Published : Oct 08, 2021, 01:49 PM ISTUpdated : Oct 08, 2021, 02:19 PM IST
lakhimpur kheri: ఆశిష్ మిశ్రాను ఎందుకు అరెస్ట్ చేయలేదు,పోలీసులపై సుప్రీం సీరియస్

సారాంశం

లఖింపూర్ ఖేరి ఘటన విషయంలో యూపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి కొడుకును ఎందుకు అరెస్ట్ చేయలేదని ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించింది.


న్యూఢిల్లీ: లఖీంపూర్ ఖేరి ఘటన విషయంలో యూపీ ప్రభుత్వ తీరును సుప్రీంకోర్టు తప్పుబట్టింది.యూపీ పోలీసుల తీరుపై supreme court చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ఆగ్రహం వ్యక్తం చేశారు.

also read:Lakhimpur Kheri : సమన్లు అందుకోకుండా పోలీసులను తిప్పలు పెట్టిన అశిష్...

lakhimpur kheri ఘటనపై శుక్రవారం నాడు సుప్రీంకోర్టు విచారణ నిర్వహించింది.లఖీంపూర్ ఖేరీలో చోటు చేసుకొన్న హింసాత్మక ఘటనలపై యూపీ సర్కార్ తీసుకొన్న చర్యలపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినా కూడ ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించింది.  

దేశంలో ఇతర హత్య కేసుల్లో కూడ ఇలాంటి చర్యలే తీసుకొంటున్నారా అని ప్రశ్నించింది.కేంద్ర మంత్రి కొడుకు ఆశిష్ మిశ్రాను ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేదని సుప్రీంకోర్టు అడిగింది..

అయితే ఈ విషయమై యూపీ సర్కార్ స్పందించింది. పోలీసుల ఎదుట విచారణకు హాజరు కావడానికి మరింత సమయంలో కావాలని ఆశిష్ మిశ్రా కోరారని సుప్రీంకోర్టుకు యూపీ ప్రభుత్వం తెలిపింది. శనివారం నాడు ఉదయం 11 గంటల వరకు Ashish mishra పోలీసుల ముందు హాజరు కాకపోతే అరెస్ట్ వారెంట్ కోసం ప్రయత్నిస్తామని యూపీ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు  తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం చర్యలతో తాము సంతృప్తి చెందలేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

ఈ కేసు విచారణను cbiకి బదిలీ చేయడానికి తమకు అభ్యంతరం లేదని యూపీ ప్రభుత్వం ఉన్నత న్యాయస్థానానికి తెలిపింది. మరో సంస్థతో దర్యాప్తు చేయించాలా వద్దా అనే అంశంపై తదుపరి విచారణలో నిర్ణయిస్తామని ఉన్నత న్యాయస్థానం ప్రకటించింది.

ఈ ఘటనకు బాధ్యులైనవారిపై చర్యలు తీసుకోవాల్సిన భాద్యత యూపీ పోలీసులపై ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. సాక్ష్యాలను డీజీపీ కాపాడాలని కోర్టు సూచించింది.
ఈ కేసు విచారణను ఈ నెల 20వ తేదీ తర్వాత విచారణ చేపడుతామని సుప్రీంకోర్టు తెలిపింది. 

లఖీంపూర్ ఖేరి లో చోటు చేసుకొన్న హింసాత్మక ఘటనల్లో ఎనిమిది మంది మరణించారు. ఈ ఘటనకు కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా తనయుడు ఆశిష్ మిశ్రా కారణమనే రైతులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఘటనతో తన కొడుకుకు సంబంధం లేదని అజయ్ మిశ్రా గతంలోనే ప్రకటించారు. 

PREV
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం