మంచాల కొరత : లక్నో ఆసుపత్రిలో బిజెపి మాజీ ఎంపి కుమారుడు మృతి, డాక్టర్ సస్పెన్షన్..

By SumaBala Bukka  |  First Published Oct 31, 2023, 10:17 AM IST

ఆస్పత్రిలో మంచాల కొరతతో ఓ బీజేపీ మాజీ మంత్రి కొడుకు మరణించాడు. ఈ షాకింగ్ ఘటన ఢిల్లీలో వెలుగు చూసింది. 


న్యూఢిల్లీ : ఎమర్జెన్సీ వార్డులో పడకల కొరత కారణంగా లక్నోలోని ఎస్‌జిపిజిఐ ఆసుపత్రిలో బిజెపి మాజీ ఎంపి కొడుకు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో తీవ్ర వేదనతో ఆ మాజీ ఎంపీ తన కుమారుడి మృతదేహంతో వార్డు వద్ద నిరసనకు బైఠాయించాడు. దీనికి కారణమైన వైద్యుడిని ప్రభుత్వం ప్రశ్నించి, సస్పెండ్ చేసి తదుపరి చర్యలకు హామీ ఇచ్చేవరకు నిరసన కొనసాగిస్తానని తెలిపారు. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెడితే... 

భైరోన్ ప్రసాద్ మిశ్రా కుమారుడు, 41 ఏళ్ల ప్రకాష్ మిశ్రా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. నిన్న రాత్రి 11 గంటల సమయంలో ఎస్జీపీజీఐ ఎమర్జెన్సీ వార్డుకు తీసుకెళ్లారు. అయితే, అక్కడ మిశ్రాకు మంచం అందుబాటులో లేదని వైద్యులు తెలిపారు. అంతేకాదు, ఎమర్జెన్సీ డాక్టర్లు ఈ విషయంలో తాము సహాయం చేయడానికి ఏమీ చేయలేదని పేర్కొన్నారు. ఆ తరువాత కాసేపటికే తన కుమారుడు మరణించాడని మాజీ ఎంపీ పేర్కొన్నారు.

Latest Videos

undefined

ప్రేమించిందని.. 15 ఏళ్ల కూతురిని కర్రలు, గొడ్డలితో కొట్టి చంపి, మృతదేహాన్ని బావిలో పడేసిన కన్నతల్లి...

పార్లమెంటులో బండా నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన మిశ్రా, ఈ ఘటనతో షాక్ అయ్యాడు. తన కుమారుడి మృతదేహంతో ఎమర్జెన్సీ వార్డు వెలుపల నిరసనలో కూర్చున్నారు. "వీరి నిర్లక్ష్యంతో నేను నా కొడుకును పోగొట్టుకున్నాను. అందుకే నేను ఇక్కడే కూర్చున్నాను. నా తర్వాత దాదాపు 20-25 మంది చికిత్స పొందారు. నేను నిరసనగా కూర్చున్న తరువాత అందరూ అతనిపై ఫిర్యాదు చేశారు. అతడికి కఠినంగా శిక్షించాలి" ఆయన విలేకరులతో అన్నారు.

దీనిపై విచారణకు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని ఆసుపత్రి అధికారులు హామీ ఇచ్చారు. "ఐసీయూ (ఇంటెన్సివ్ కేర్ యూనిట్)కి తీసుకెళ్లమని డాక్టర్ చెప్పాడు. కానీ బెడ్స్ మాత్రం అందుబాటులో లేవు.. ఎందుకు చెప్పాడో తెలియదు.. ఓ కమిటీ వేసాం.. కఠిన చర్యలు తీసుకుంటాం... ప్రస్తుతం డాక్టర్‌ని సస్పెండ్‌ చేశాం’’ అని ఆస్పత్రి చీఫ్‌ డాక్టర్‌ ఆర్‌కే ధీమాన్‌ తెలిపారు.

ఈ ఘటనపై సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ రాష్ట్ర బీజేపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. "ఇది ఆసుపత్రి తప్పు కాదు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తప్పు. ఆసుపత్రికి ఎందుకు బడ్జెట్లు ఇవ్వడం లేదు?" అని ప్రశ్నించారు. ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మాజీఎంపీ ఇంటికి వెళ్లి సందర్శించారు. ఇది దురదృష్టకర సంఘటన అని, ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశామని, దీనిపై సమగ్ర విచారణ జరుపుతామని చెప్పారు.

click me!