రూ.6లక్షల విలువైన కుక్క.. దారుణ హత్య..!

Published : Jun 22, 2021, 09:11 AM IST
రూ.6లక్షల విలువైన కుక్క.. దారుణ హత్య..!

సారాంశం

మూడు లక్షలు రూపాయలు వెచ్చించి చోటా రాజ అనే లాబ్రిడార్‌ జాతి కుక్కను కొన్నాడు.  పోషకాహారం పెట్టి దాన్ని బలంగా తయారుచేశాడు. ఈ నేపథ్యంలో దాని మాజీ ఓనర్‌ రంగంలోకి దిగాడు.

ఆ కుక్క ఖరీదు రూ.6లక్షలు. దానిని అమ్ముకోని.. సంతోషంగా జీవించాలని అనుకున్నారు. ఈ విషయంలో గొడవ జరిగి.. ఏకంగా కుక్కనే చంపేశారు. ఈ సంఘటన హర్యానాలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

హర్యానాలోని కర్నల్ ప్రాంతానికి చెందిన సాగర్ కొద్ది నెలల క్రితం షేర్‌ ఘర్‌ ప్రాంతంలోని కుక్కలు అమ్మే డీలర్‌ దగ్గరినుంచి మూడు లక్షలు రూపాయలు వెచ్చించి చోటా రాజ అనే లాబ్రిడార్‌ జాతి కుక్కను కొన్నాడు.  పోషకాహారం పెట్టి దాన్ని బలంగా తయారుచేశాడు. ఈ నేపథ్యంలో దాని మాజీ ఓనర్‌ రంగంలోకి దిగాడు.


ఆ కుక్కను ఆరు లక్షలకు అమ్మి సొమ్ము చేసుకుందామని గొడవ చేయటం మొదలుపెట్టాడు. దీంతో సాగర్‌కు, మాజీ ఓనర్‌కు మధ్య గొడవ జరిగింది. కొద్దిరోజుల క్రితం చోటా రాజ కనిపించకుండాపోయింది. ఆదివారం దారుణంగా హత్యకు గురై కనిపించింది. దీంతో సాగర్‌ పోలీసులను ఆశ్రయించాడు. మాజీ ఓనర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Coldest Places in India : మైనస్ 50°C ఉష్ణోగ్రతలా..! అత్యంత చలిగావుండే టాప్ 5 ప్రదేశాలివే
Gen z పోస్టాఫీస్‌లు వ‌చ్చేస్తున్నాయ్‌.. వీటి ప్ర‌త్యేక‌త ఏంటి.? వీటిలో ఏముంటాయ్‌..