సెప్టెంబర్-అక్టోబర్ మధ్యలో కరోనా థర్డ్‌వేవ్ పీక్‌లో: ఐఐటీ కాన్పూర్ స్టడీ

By narsimha lodeFirst Published Jun 21, 2021, 8:58 PM IST
Highlights

:దేశంలో ఈ ఏడాది సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో కరోనా మూడో వేవ్  వచ్చే అవకాశం ఉందని ఐఐటీ కాన్పూర్ నిపుణుల బృందం అంచనా వేస్తోంది. 

న్యూఢిల్లీ:దేశంలో ఈ ఏడాది సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో కరోనా మూడో వేవ్  వచ్చే అవకాశం ఉందని ఐఐటీ కాన్పూర్ నిపుణుల బృందం అంచనా వేస్తోంది. ఐఐటీ కాన్పూర్ కు చెందిన ప్రోఫెసర్ రాజేష్ రంజన్ , మహేంద్ర వర్మలు తమ బృందంతో కరోనా మూడో వేవ్ పై  అధ్యయం చేశారు. 

కరోనా థర్డ్‌వేవ్ దేశంలో అనివార్యమని ఎయిమ్స్ చీఫ్ గులేరియా రెండు రోజుల క్రితం ప్రకటించారు. ఇదే రకమైన అభిప్రాయాన్ని ఐఐటీ కాన్పూర్ నిపుణుల బృందం కూడ తేల్చి చెప్పింది. సెకండ్ వేవ్ ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని ఎస్ఐఆర్ మోడల్ ఆధారంగా థర్డ్‌వేవ్ ను అంచనా వేసినట్టుగా ప్రొఫెసర్ రాజేష్ రంజన్ చెప్పారు. 

జూలై 15 వరకు దేశం మొత్తం ఆన్‌లాక్ ప్రక్రియ చేపడితే   థర్డ్‌వేవ్ గరిష్టానికి చేరుకొనే అవకాశం ఉందని ఐఐటీ కాన్పూర్ స్టడీ అభిప్రాయపడింది. భౌతిక దూరం పాటించడంతో పాటు కరోనా నిబంధనలు పాటిస్తే కరోనా థర్డ్ వేవ్ కొంత ఆలస్యంగా గరిష్టానికి చేరుకొనే అవకాశం ఉందని నిపుణుల బృందం తేల్చింది.

కేరళ, గోవా, సిక్కిం, మేఘాలయా రాష్ట్రాల్లో కరోనా పాజిటివిటీ రేటు 10 శాతానికి ఎగువన ఉన్నాయి. చాలా రాష్ట్రాల్లో మాత్రం 5 శాతానికి తక్కువగా నమోదౌతున్నాయి.  గతంలో ఇండియాలో కరోనా కేసులు 4 లక్షలకుపైగా నమోదైన రోజులు కూడ ఉన్నాయి. ఒక్క రోజులో  కనీసం 6 వేల మంది మరణించిన సందర్భాలు కూడ ఉన్నాయి. లాక్‌డౌన్ తో కారణంగా చాలా రాష్ట్రాల్లో  కరోనా అదుపులోకి వచ్చింది.ఈ నెలాఖరు నాటికి ఐఐటీ కాన్పూర్ నిపుణుల బృందం  కరోనా థర్డ్‌వేవ్  మరొక నివేదికను విడుదల చేయనుంది.


 

click me!