యడ్యూరప్ప ఇంటికి నేను వెళ్లనే లేదు: బలపరీక్షలో నెగ్గిన కుమారస్వామి

First Published May 25, 2018, 3:50 PM IST
Highlights

తాను బిజెపి నేత యడ్యూరప్ప ఇంటికి ఎన్నడూ వెళ్లలేదని కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి స్పష్టం చేశారు. 

బెంగళూరు: తాను బిజెపి నేత యడ్యూరప్ప ఇంటికి ఎన్నడూ వెళ్లలేదని కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి స్పష్టం చేశారు. విశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా శుక్రవారం బిజెపి వాకౌట్ చేసిన తర్వాత ఆయన మాట్లాడారు. యడ్యూరప్ప చేసిన విమర్శలను తిప్పికొట్టారు. కుమారస్వామి బలపరీక్షలో నెగ్గారు. కుమారస్వామి ప్రతిపాదించిన విశ్వాస తీర్మానాన్ని సభ ఆమోదించినట్లు స్పీకర్ ప్రకటించారు.

జాతీయగీతాన్ని అవమానించిన మీరా మాకు నీతులు చెప్పేదని అడిగారు. బిజెపి నాటకాలు ఆడుతోందని, బిజెపి ఆడబోయే నాటకాలకు ఇక్కడ రిహార్సల్ చేసిందని ఆయన అంతకు ముందు అన్నారు. యడ్యూరప్ప వంటి పలాయనవాద నేతను తాను ఇప్పటి వరకు చూడలేదని అన్నారు. 

తమ ప్రభుత్వాన్ని కాపాడాలని బిజెపి తనను ప్రాధేయపడిందని అన్నారు. యడ్యూరప్ప వాడిన భాష వల్లనే కర్ణాటక ప్రజలు ఆయనకు అధికారం ఇవ్వలేదని కుమారస్వామి అన్నారు. 

ఇదిలావుంటే, రైతులకు 24 గంటల లోపు రుణమాఫీ ప్రకటించాలని, లేకపోతే ఈ నెల 28వ తేదీన రాష్ట్ర బంద్ కు పిలుపునిస్తామని యడ్యూరప్ప చెప్పారు. 

click me!