
నేటి తరం యువత అస్సలు ఒత్తిడిని ఎదుర్కోలేకపోతోంది. క్షణికావేశంలో అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రతి చిన్నా.. పెద్ద సమస్యకు ఆత్మహత్య పరిష్కారమని భావిస్తున్నారు. ముందు వెనుక ఆలోచించకుండా.. చావుతో చెలగాటం ఆడుతున్నారు. తాజా ఉపాధ్యాయుడు కొట్టాడని పదోవ తరగతి చదువుతున్న ఓ విద్యార్ది పాఠశాల భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇలాంటి ఘటన కోల్‌కతాలో వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకెళ్తే.. దక్షిణ కోల్‌కతాలోని కస్బా ప్రాంతంలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థి సోమవారం తన పాఠశాల టెర్రస్‌పై నుంచి దూకి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. 16 ఏళ్ల యువకుడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.
ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడంలో విఫలమైనందుకు పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు తమ కుమారుడిని తిట్టారని, పాఠశాల యాజమాన్యం ఏదో దాచడానికి ప్రయత్నిస్తోందని తల్లిదండ్రులు ఆరోపించారు. తరగతిలో అందరి ముందు ఉపాధ్యాయుడు తనను తిట్టాడని, ఈ చర్యను అవమానంగా భావించిన ఆ విద్యార్థి టెర్రస్‌పైకి వెళ్లి దూకి ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసు అధికారి తెలిపారు.
గాయపడిన ఆ బాలుడ్ని సమీపంలోని ఆస్పతికి తరలించగా.. అప్పటికే ప్రాణాలు కోల్పోయడాని వైద్యులు గుర్తించారు. ఈ ఘటనపై విచారణ జరుగుతోందని ఆంగ్ల మాధ్యమ పాఠశాల ఒక ప్రకటనలో తెలిపింది. ఏ ఉపాధ్యాయుడు ఎప్పుడూ పిల్లలను లక్ష్యంగా చేసుకుని వారిని వేధించడనీ, తమది చైల్డ్-ఫ్రెండ్లీ స్కూల్ అని ఓ ఉపాధ్యాయుడు పేర్కొన్నారు.