భార్యను చంపిన భర్త: తండ్రికి షాకిచ్చిన మూడేళ్ల కొడుకు, ఏమైందంటే?

First Published Jul 10, 2018, 1:02 PM IST
Highlights

అనుమానంతో కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరులో శ్రీధర్ అనే వ్యక్తి తన భార్య సుకమ్మను హత్య చేశాడు. అయితే పిల్లల ముందే భార్యను హత్య చేశాడు. శ్రీధర్ మూడేళ్ల కొడుకు కోర్టులో తండ్రికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాడు. దీంతో నిందితుడికి కోర్టు శిక్షను విధించింది.


న్యూఢిల్లీ: సాధారణంగా  కోర్టుల్లో ఓ కేసులో శిక్ష పడేందుకు ఏళ్ల తరబడి  సమయం తీసుకొంటారు. 13 రోజుల్లోనే  ఈ కేసులో  నిందితుడిని  దోషిగా  తేల్చింది కోర్టు.మూడేళ్ల చిన్నారి సాక్ష్యాన్ని పరిగణనలోకి తీసుకొని  కోర్టు ఈ తీర్పు ఇచ్చారు.  తండ్రికి వ్యతిరేకంగా కోర్టులోనే మూడేళ్ల కొడుకు  ప్రశ్నించడంతో  నిందితుడికి కోర్టు శిక్షను ఖరారు చేసింది.

బెంగళూరులోని బగ్గలురంగవనహళ్లి గ్రామానికి చెందిన 35ఏళ్ల శ్రీధర్‌ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. శ్రీధర్‌ దంపతులకు మూడేళ్ల కుమారుడు, ఏడాది వయసున్న పాప ఉంది.. అయితే శ్రీధర్‌ తరచూ తన భార్య సకమ్మపై అనుమానపడేవాడు. 

 ఈ విషయంపై ఇద్దరి మధ్యా గొడవలు జరుగుతుండేవి. గత నెల 27న కూడా శ్రీధర్ తన భార్యతో గొడవకు దిగాడు. ఈ క్రమంలో ఆవేశానికి లోనైన శ్రీధర్‌ పిల్లల ముందే భార్యను చంపేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

అయితే  ఈ ఘటనను ప్రత్యక్షంగా చూసిన  శ్రీధర్ మూడేళ్ల కొడుకు పక్కనే నివాసం ఉండే తమ బంధువులకు ఈ విషయాన్ని చెప్పాడు. వారు వచ్చి చూసేసరికి సకమ్మ మృతి చెందింది. ఈ ఘటనపై వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీధర్ ను అరెస్ట్ చేశారు పోలీసులు.

ఈ కేసు దర్యాప్తు పూర్తైంది. దీంతో సోమవారం నాడు శ్రీధర్ ను పోలీసులు కోర్టులో హజరుపర్చారు.ఈ కేసులో ప్రత్యక్షసాక్షిగా ఉన్న శ్రీధర్ మూడేళ్ల కొడుకును కోర్టులో సాక్షిగా ప్రవేశపెట్టారు. 

కోర్టు బోనులోకి వెళ్లిన ఆ బాలుడు మా అమ్మను ఎందుకు చంపావంటూ తండ్రిని నిలదీశాడు. ఈ మాటలను విన్న జడ్జి  .. శ్రీధర్ ను దోషిగా  తేల్చారు.  13 రోజల్లోనే నిందితుడిని దోషిగా కోర్టు తేల్చింది.

click me!