పదహారేళ్ల మైనర్ బాలుడితో సహాజీవనం చేసేందుకు కూతురిని చంపిన వివాహిత బాగోతం కోల్‌కతా రాష్ట్రంలో చోటు చేసుకొంది. చిన్నారి హత్య కేసును దర్యాప్తు చేసిన పోలీసులు ఈ దారుణాన్ని బయటపెట్టారు.
కోల్ కతా: పదహారేళ్ల మైనర్ బాలుడితో సహాజీవనం చేసేందుకు కూతురిని చంపిన వివాహిత బాగోతం కోల్‌కతా రాష్ట్రంలో చోటు చేసుకొంది. చిన్నారి హత్య కేసును దర్యాప్తు చేసిన పోలీసులు ఈ దారుణాన్ని బయటపెట్టారు.
బెంగాల్ రాష్ట్రంలోని కోల్‌కతా నగరంలోని శ్యామ్ బజార్‌లో మురికివాడకు చెందిన మణిదాస్ అనే వివాహిత తన రెండున్నరేళ్ల కూతురితో నివసిస్తోంది. మణిదాస్ భర్తతో విడిపోయింది. ఆమె భర్త మద్యానికి బానిసగా మారాడు. దీంతో ఆమె భర్తతో విడిపోయింది.
undefined
భర్తను వదిలేసిన ఆమె పదహారేళ్ల బాలుడితో సహాజీవనం చేస్తోంది. అయితే పదహారేళ్ల బాలుడితో సహాజీవనం చేయడానికి కూతురు అడ్డుగా ఉందని భావించిన మణిదాస్ తన కూతురు అడ్డు తొలగించుకోవాలని భావించింది.
బాలికను హత్య చేసి మ్యాన్ హోల్‌లో పడేసింది. తన కూతురు అదృశ్యమైందని .. ఓ తాగుబోతు తనను చంపేందుకు యత్నించాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. మణిదాస్ తో సహాజీవనం చేస్తున్న 16 ఏళ్ల యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తే అసలు విషయం వెలుగు చూసింది. మణిదాసే తన కూతుర్ని చంపేసిందని పోలీసులకు తెలిసింది.
సహాజీవనానికి అడ్డుగా ఉందనే కారణంగానే చిన్నారి అడ్డుగా ఉందని భావించి చంపేసినట్టు చెప్పడంతో పోలీసులు మణిదాస్ ను అరెస్ట్ చేసి విచారించారు. దీంతో తాను చేసిన హత్యను ఆమె ఒప్పుకొంది.