ఇక మీదట ‘‘ఐఆర్‌సీటీసీ ’’ ఉండదట

Published : Sep 07, 2018, 01:07 PM ISTUpdated : Sep 09, 2018, 11:25 AM IST
ఇక మీదట ‘‘ఐఆర్‌సీటీసీ ’’ ఉండదట

సారాంశం

కోట్లాదిమంది భారతీయులు తమ గమ్యస్థానాలను చేరుకునేందుకు ఉపకరిస్తున్న ‘‘ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పోరేషన్’’( ఐఆర్‌సీటీసీ) ఇక మీదట కనిపించదట

కోట్లాదిమంది భారతీయులు తమ గమ్యస్థానాలను చేరుకునేందుకు ఉపకరిస్తున్న ‘‘ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పోరేషన్’’( ఐఆర్‌సీటీసీ) ఇక మీదట కనిపించదట.. అంటే వెబ్‌సైట్ మూసివేయడమో..సంస్థను రద్దు చేయడమో కాదండి. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ పేరు మార్చబోతున్నారట.

కేంద్ర రైల్వేశాఖ మంత్రి పియూష్ గోయెల్ వ్యాఖ్యలు ఇదే చెబుతున్నాయి. ఐఆర్‌సీటీసీ అనే పేరును గుర్తు పెట్టుకోవడం కష్టంగా ఉందని.. అంతకంటే సులువైన పేరును వెతుకుతున్నామని.. కాచీగా.. ఆకర్షణీయంగా.. జనానికి తెలికగా గుర్తుండేలా కొత్త పేరు ఉండాలని ఆయన భావిస్తున్నారు.

ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆయన రైల్వేశాఖను ఆదేశించారు. కొత్త పేరు ఏంటి..? ఎప్పుడు తీసుకుంటారు అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే ఒక అధికారి ‘‘ రైల్ ట్రావెల్’’ అనే పేరును ప్రతిపాదించాడట. 
 

PREV
click me!

Recommended Stories

Indigo కు షాక్: 10 శాతం విమానాలు రద్దు.. రంగంలోకి ప్రత్యేక టీమ్ తో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
ఏఐ ఉద్యోగాలను తగ్గించదు.. పెంచుతుంది : యోగి ఆసక్తికర కామెంట్స్