నీటిలో లైవ్ స్టంట్... మేజిషియన్ మిస్సింగ్

Published : Jun 17, 2019, 02:46 PM IST
నీటిలో లైవ్ స్టంట్... మేజిషియన్ మిస్సింగ్

సారాంశం

మ్యాజిక్ చేసి అందరినీ మెప్పించాలనుకున్నాడు. అందుకోసం తన ప్రాణాన్నే పణంగా పెట్టాడు. చివరకు ఎవరికీ కనిపించకుండా పోయాడు ఓ మేజిషియన్. ఈ సంఘటన కోల్ కత్తాలో చోటుచేసుకుంది. 

మ్యాజిక్ చేసి అందరినీ మెప్పించాలనుకున్నాడు. అందుకోసం తన ప్రాణాన్నే పణంగా పెట్టాడు. చివరకు ఎవరికీ కనిపించకుండా పోయాడు ఓ మేజిషియన్. ఈ సంఘటన కోల్ కత్తాలో చోటుచేసుకుంది. 

పూర్తి వివరాల్లోకి వెళితే... జాదుగర్‌ మంద్‌రాకేగా ప్రసిద్ధి పొందిన చంచల్‌ లాహిరి (40) ఆదివారం పోలీసులు, మీడియా, కుటుంబసభ్యులు చూస్తుండగా విన్యాసానికి నదిలోకి దిగారు. ఉక్కు సంకెళ్లు, తాడుతో బంధించుకుని, కోల్‌కతాలోని హౌరా బ్రిడ్జి మీదుగా గంగా నదిలోకి దిగారు. అలా లోపలికి వెళ్లిన.. సురక్షితంగా బయటకు రావడమే మ్యాజిక్. కానీ అలా జరగలేదు. నీటిలోకి వెళ్లిన ఆయన తిరిగి బయటకు రాలేదు. దీంతో... ఆయన కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

ఈ లైవ్ స్టంట్ చేయబాడానిక లాహిరి అనుమతి తీసుకున్నారు కానీ... కనీస భద్రతా సదుపాయాలు తీసుకోలేదని పోలీసులు చెబుతున్నారు. ఈ స్టంట్ చేయడానికి ముందు దీని గురించి ఆయన మాట్లాడారు.‘‘బుల్లెట్‌ప్రూఫ్‌ గ్లాస్‌ బాక్సులో కూర్చుని సంకెళ్లతో బంధించుకున్నాను. తాళం వేసేశారు. 29సెకన్లలో బయటికి వచ్చేశాను. ఈసారి బయటకు రావడం కష్టమే. బయటకు రాగలిగితే మ్యాజిక్‌ అవుతుంది. లేదంటే ట్రాజిక్‌ అవుతుంది’’  అని చెప్పారు. నిజంగా మ్యాజిక్ కాస్త ట్రాజెడీ గా మారిందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

PREV
click me!

Recommended Stories

Kangana Ranaut: జెన్‌జీ నిరసనకారులపై షాకింగ్ కామెంట్స్.. కంగనా రనౌత్ కు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిపడేసిన బాలీవుడ్ స్టార్స్ !
August 1 Rule Changes: గ్యాస్ సిలిండర్ ధరల నుంచి రైలు టికెట్ల వరకు.. ఆగస్టు 1 నుంచి 5 కొత్త రూల్స్