
తాము పడే కష్టం తమ పిల్లలు పడకూడదనే ఉద్దేశ్యంతో రెక్కలు ముక్కలు చేసుకుని వారిని కార్పోరేట్ కాలేజీల్లో చదవిస్తున్నారు తల్లీదండ్రులు. అయితే చదుకుంటానన్న పాపానికి కన్న కూతురినే చంపేందుకు ప్రయత్నించాడో తండ్రి.
వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌లో చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన 15 ఏళ్ల కూతురికి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే ఆమెకు చదువుకోవాలని ఉండటంతో అప్పుడే పెళ్లి ఇష్టం లేదని చెప్పేసింది.
దీనిని జీర్ణించుకోలేకపోయిన తండ్రి.. కూతురిపై కక్ష పెంచుకున్నాడు. ఓ రోజు కత్తితో విచక్షణారహితంగా పొడిచి కాలువలో పడేశాడు. అతి కష్టం మీద ఈదుకుంటూ ఒడ్డుకు చేరిన బాలిక ఎలాగో తప్పించుకుంది.
ఈ ఘటనపై బాధితురాలి బావ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నాన్న నన్ను కాలువ దగ్గరకు తీసుకెళ్ళి సోదరుడి సాయంతో చంపాలని చూశాడని బాలిక వాపోయింది. తన సోదరుడు గుడ్డతో గొంతు బిగిస్తే.. నాన్న వెనుక నుంచి కత్తితో పలుమార్లు పొడిచాడని తెలిపింది.