న్యూ ఇయర్ స్పెషల్.. మందుబాబులకు గుడ్ న్యూస్

Published : Dec 27, 2018, 11:34 AM IST
న్యూ ఇయర్ స్పెషల్.. మందుబాబులకు గుడ్ న్యూస్

సారాంశం

న్యూ ఇయర్ వేడుకలు దగ్గరపడుతున్నాయి. కొత్త సంవత్సరం వచ్చిందంటే చాలు.. అందరికంటే ఎక్కువ ఉత్సాహం మందుబాబులకే ఉంటుంది. 

న్యూ ఇయర్ వేడుకలు దగ్గరపడుతున్నాయి. కొత్త సంవత్సరం వచ్చిందంటే చాలు.. అందరికంటే ఎక్కువ ఉత్సాహం మందుబాబులకే ఉంటుంది. డిసెంబర్ 31వ తేదీ రాత్రి మొత్తం మందు తాగి.. చిందులు వేయాలని చాలా మంది ఉత్సాహపడుతుంటారు. ఈ న్యూ ఇయర్ కి మందుబాబుల కోరిక నెరవేరనుంది.

పశ్చిమబెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం మద్యం ప్రియులకు శుభవార్త తెలియజేసింది. డిసెంబర్ 31, కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా మద్యం దుకాణాలను రాత్రి 11గంటల వరకు తెరచి ఉంచేలా అనుమతి ఇస్తూ.. కోల్ కతా ఎక్సైజ్ శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త సంవత్సరరవేళ మద్యం దుకాణాల ముందు జనం బారులు తీరనున్న నేపథ్యంలో మద్యం దుకాణాల వేళలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

ప్రభుత్వ నిర్ణయానికి మద్యం ప్రియులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉదయం 9గంటల నుంచి రాత్రి 11గంటల వరకు మద్యం దుకాణాలను తెరచి ఉంచనున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో రాష్ట్రంలోని 4200మద్యం దుకాణాల్లో డిసెంబర్ 31న మద్యం అమ్మకాల వల్ల రాష్ట్రానికి రూ.10,500కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

మెల్‌బోర్న్‌ లో మోదీ క్రేజ్ చూసి ఆస్ట్రేలియా ప్రధాని షాక్ | PM Modi in Australia: Melbourne
ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన మోదీ కి అదిరిపోయే వెల్ కమ్ | PM Modi arrives in Melbourne, Australia