విమానం టాయ్ లెట్ లో స్మోకింగ్.. ప్రయాణికుడి అరెస్ట్

By ramya neerukondaFirst Published Dec 27, 2018, 10:23 AM IST
Highlights

విమాన టాయ్ లెట్ లో అనుమతి లేకుండా సిగరెట్ తాగిన ప్రయాణికుడిని  పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన గోవాలో చోటుచేసుకుంది.


విమాన టాయ్ లెట్ లో అనుమతి లేకుండా సిగరెట్ తాగిన ప్రయాణికుడిని  పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన గోవాలో చోటుచేసుకుంది. డిసెంబర్ 25వ తేదీ( క్రిస్మస్ పండుగ రోజు)న ఇండిగో విమానాయాన సంస్థకి చెందిన విమానం ఒకటి  అహ్మదాబాద్ నుంచి గోవాకి బయలుదేరింది.

కాగా.. విమానం  టేకాఫ్ అయిన కొద్ది సేపటికి.. ప్రయాణికుడు ఒకరు.. టాయ్ లెట్ లోకి వెళ్లి స్మోకింగ్ చేశాడు. కాగా.. టాయ్ లెట్ నుంచి పొగరావడాన్ని గమనించిన ప్రయాణికులు కొందరు.. వెంటనే విమాన సిబ్బందిని అలర్ట్ చేశారు. వాస్తవానికి డొమెస్టిక్ విమానాల్లో పొగతాగడానికి అనుమతి లేదు. అది విమానానికి అంత సురక్షితం కాదు.

కాగా.. నిబంధనలను ఉల్లంఘించి విమానంలో పొగతాగినందుకు ప్రయాణికుడిపై కెప్టెన్ కు సిబ్బంది ఫిర్యాదు చేశారు. చట్ట ప్రకారం విమానంలో పొగతాగడం నేరం కావడంతో.. విమానం గోవాలో ల్యాండ్ అవ్వగానే అతనిని స్థానిక పోలీసులకు అప్పగించారు. పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వారం రోజుల క్రితం విస్తారా ఎయిర్ లైన్స్ లోనూ ఇలాంటి సంఘటనే చోటుచేసుకుంది. విమానంలో సిగరెట్ తాగడానికి అనుమతి కావాలంటూ ప్రయాణికుడు గొడవ చేయడంతో.. ఆ విమానం మూడు గంటలు ఆలస్యంగా గమ్యస్థానానికి చేరుకుంది. 

click me!