ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి హాజరైన ప్రముఖులకు మహాప్రసాదాన్ని అందించనున్నారు. ఈ మహాప్రసాదం ఎలా ఉంటుంది? వాటితోపాటు ఇంకేమైనా అందిస్తున్నారా? అనే చర్చ జరుగుతున్నది. మహా ప్రసాదానికి సంబంధించి ఓ వీడియోను ఏఎన్ఐ ట్వీట్ చేసింది.
Maha Prasad: జనవరి 22వ తేదీన అయోధ్యలోని రామ జన్మభూమిలో రామ్ లల్లాకు ప్రాణ ప్రతిష్ట చేయనున్నాు. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నది. ఇప్పటి వరకు సుమారు 20వ వేల ప్యాకెట్ల మహా ప్రసాదాలు శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టుకు అందాయి. ఈ మహా ప్రసాదాలను ఆదివారం ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి వచ్చే వీవీఐపీలు, ఇతర ప్రముఖులకు అందించనున్నారు.
ఈ ప్రసాదాన్ని పూర్తిగా నెయ్యి, ఐదు రకాల డ్రై ఫ్రూట్స్, చక్కెర, గ్రామ్ ఫ్లోర్‌లతో చేశారు. మహా ప్రసాదాలను ప్రత్యేకమైన కిట్ లేదా బాక్స్‌లో పెట్టి అందిస్తారు. ఆ బాక్స్‌లోపల లడ్డుతోపాటు మరికొన్ని ఐటమ్స్‌ను ఉంచుతున్నారు. అందులో సరియూ నదీ నీటితో నింపిన ఓ చిన్న బాటిల్ కూడా ఉన్నది. ఎరుపు రంగులోని పత్తి వత్తి, అక్షింతలు కూడా అందులో ఉంటాయి.
Also Read : Nithyananda: ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి నిత్యానందను ఆహ్వానించారా ?.. ‘ ఆహ్వానం అందింది ’
| Visuals of the 'Prasad' that will be distributed among VVIPs, sadhus at the Pran Pratishtha ceremony of the Ram Temple on 22nd January in Ayodhya, Uttar Pradesh pic.twitter.com/586tzhLx83
— ANI (@ANI)వీవీఐపీలకు అందించే మహాప్రసాదాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఏఎన్ఐ ప్రకారం రామ్ కండ్ మూల్, సార్జు నీర్, కుంకుం, రుద్రాక్షలు కూడా ఆ మహాప్రసాద బాక్స్‌లో ఉంటాయి. ఈ మహాప్రసాదాలను గుజరాత్‌కు చెందిన భగ్వా సేనా భారతి గార్వి, సంత్ సేవా సంస్థాన్‌లు అయోధ్య టెంపుల్ ట్రస్ట్ పర్యవేక్షణలో వీటిని తయారు చేశాయి. ఈ ప్రసాదాలను అందించడానికి సిద్ధం చేస్తున్నారు.