బాబ్రీ మసీదు కూల్చివేతపై సీబీఐ కోర్టు తీర్పు: ఎవరీ సురేంద్ర యాదవ్....

By narsimha lodeFirst Published Sep 30, 2020, 5:01 PM IST
Highlights

బాబ్రీ  మసీదు కూల్చివేతపై  28 ఏళ్ల తర్వాత సీబీఐ ప్రత్యేక కోర్టు బుధవారం నాడు తీర్పును వెల్లడించింది. సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి ఎస్ కే యాదవ్  ఇవాళ ఈ కేసు తీర్పును  వెల్లడించారు.

న్యూఢిల్లీ: బాబ్రీ  మసీదు కూల్చివేతపై  28 ఏళ్ల తర్వాత సీబీఐ ప్రత్యేక కోర్టు బుధవారం నాడు తీర్పును వెల్లడించింది. సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి ఎస్ కే యాదవ్  ఇవాళ ఈ కేసు తీర్పును  వెల్లడించారు.

ఈ కేసు విచారణను స్వీకరించక ముందు సురేంద్ర కుమార్ యాదవ్ ఫైజాబాద్ ఏడీజే కోర్టులో జడ్జిగా పనిచేసేవాడు. ఆయనకు ఫైజాబాద్ కోర్టులో జడ్జిగా ఫస్ట్ పోస్టింగ్.ఈ కేసు తీర్పును వెల్లడించిన తర్వాత ఎస్ కే యాదవ్ రిటైర్మెంట్ తీసుకొన్నారు. 

లక్నోకు చెందిన ప్రత్యేక కోర్టు ప్రిసైడింగ్ అధికారిగా ఆయన విచారణను విన్నారు. ఐదేళ్ల క్రితం ఆయనను ప్రత్యేక కోర్టు న్యాయమూర్తిగా నియమించింది సుప్రీంకోర్టు.
2017 ఏప్రిల్ 19వ తేదీన ఈ కేసును రోజువారీ విచారించి రెండేళ్లలో తీర్పును వెల్లడించాలని సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది.

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని  జౌన్‌‌పూర్ జిల్లాలోని పఖన్ పూర్ గ్రామానికి చెందిన రామకృష్ణ యాదవ్ ఇంటిలో సురేంద్ర యాదవ్ జన్మించాడు. 31 ఏళ్ల వయస్సులో ఆయన న్యాయసేవకు ఎంపికయ్యాడు.ఫైజాబాద్ అడిషనల్ మున్సిఫల్ కోర్టు సురేంద్ర యాదవ్ కు తొలి పోస్టింగ్. ఘజిపూర్, ఎటావా, గోరఖ్ పూర్ మీదుగా లక్నో కోర్టులో జిల్లా జడ్జి హోదాకు చేరుకొన్నాడు.

also read:బాబ్రీ మసీదు కూల్చివేత: సీబీఐ జడ్జి ఎస్ కే యాదవ్ రిటైర్మెంట్ ఏడాది పొడిగింపు

బాబ్రీ మసీదు కూల్చివేత కేసు విచారణను ఈయనకు ఇవ్వకపోతే గత ఏడాదే యాదవ్ రిటైర్మెంట్ అయ్యేవారు. గత ఏడాది లోనే ఆయన లక్నో జిల్లా జడ్జి పదవి నుండి రిటైరయ్యారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ ఆయనకు వీడ్కోలు ఇచ్చింది.బాబ్రీ మసీదు కూల్చివేత కేసును విచారిస్తున్నందున రిటైర్మెంట్  ను విచారించాలని సుప్రీంకోర్టు  కోరింది.
 

click me!