అమల్లోకి కొత్త నిబంధనలు: టీవీల ధరలకు రెక్కలు

By Siva KodatiFirst Published Sep 30, 2020, 4:54 PM IST
Highlights

డ్రైవింగ్‌ లైసెన్స్‌ నుంచి ఆరోగ్య బీమా వరకూ రేపటి నుంచి కొత్త నిబంధనలు అమలవనున్న నేపథ్యంలో పలు వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకనున్నాయి. ముఖ్యంగా టీవీల ధరలు పెరగడంతో పాటు, విదేశాలకు పంపే నగదుపై అదనపు పన్ను బాదుడు అమలవనుంది. 

డ్రైవింగ్‌ లైసెన్స్‌ నుంచి ఆరోగ్య బీమా వరకూ రేపటి నుంచి కొత్త నిబంధనలు అమలవనున్న నేపథ్యంలో పలు వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకనున్నాయి. ముఖ్యంగా టీవీల ధరలు పెరగడంతో పాటు, విదేశాలకు పంపే నగదుపై అదనపు పన్ను బాదుడు అమలవనుంది.

దీని ప్రకారం టీవీల దిగుమతులపై 5 శాతం కస్టమ్‌ సుంకాలను ప్రభుత్వం విధించనుంది. తాజా నిర్ణయంతో 32 అంగుళాల టీవీ రూ 600, 42 అంగుళాల టీవీల ధరలు రూ 1200 నుంచి రూ 1500 వరకూ పెరగనున్నాయి.

విదేశాల్లో చదువుకునే పిల్లలకు తల్లితండ్రులు పంపే నగదు, బంధువులకు సాయం చేస్తూ పంపే మొత్తాలపై అదనంగా 5 శాతం టీసీఎస్ విధిస్తారు. ఆర్‌బీఐ రెమిటెన్స్‌ పథకం కింద విదేశాలకు పంపే మొత్తాలపై టీసీఎస్‌ చెల్లించాలని ఫైనాన్స్‌ చట్టం, 2020 పేర్కొంది.

నూతన నిబంధనల ప్రకారం డ్రైవింగ్‌ లైసెన్సు పొందడం సులభతరం కానుంది. గురువారం నుంచి డ్రైవింగ్‌ లైసెన్స్‌కు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు, ఈ చలాన్‌ను ఆన్‌లైన్‌ పోర్టల్‌లో పొందుపరచాల్సి ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది.

డ్రైవింగ్‌ లైసెన్స్‌ పొందేందుకు పరిమిత డాక్యుమెంట్లు సరిపోతాయని, హార్డ్‌ కాపీని అధికారులు అడగరని ఉత్తర్వుల్లో తెలిపింది. అనర్హతకు గురైన డ్రైవింగ్‌ లైసెన్సులు, పునరుద్ధరించిన లైసెన్సుల వివరాలను ఈ పోర్టల్‌లో రికార్డు చేస్తూ ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తారు.

ఇక ఆరోగ్య బీమా రంగంలో మూడు కీలక మార్పులను చేపట్టినట్టు ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఐఆర్‌డీఏ) వెల్లడించింది. ఇన్సూరెన్స్ కంపెనీలు వినియోగదారులు సులభంగా అర్ధం చేసుకునేలా పాలసీలను రూపొందించడంతో పాటు టెలిమెడిసిన్‌కూ బీమా కవరేజ్‌ను వర్తింపచేస్తాయి. దీంతో ఇక నుంచి బీమా క్లెయిమ్‌లను బీమా కంపెనీలు సులభంగా పరిష్కరించనున్నాయి.

click me!