ఆగ్రాలో మైనర్ బాలిక కిడ్నాప్, సామూహిక అత్యాచారం.. అరెస్టుకు భయపడి నిందితుడి ఆత్మహత్య...

ఓ మైనర్ బాలికను కిడ్నాప్ చేసిన ముగ్గురు వ్యక్తులు ఆమె మీద అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుల్లో ఒకరు ఆత్మహత్య చేసుకున్నాడు. 

Kidnapping and gang rape of a minor girl in Agra, Accused committed suicide fearing arrest - bsb

ఉత్తరప్రదేశ్ : ఆగ్రాలో ఓ మైనర్ బాలికను ముగ్గురు వ్యక్తులు అపహరించి.. ఆమె మీద అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసులో తనపై అభియోగాలు మోపారని తెలుసుకున్న నిందితుల్లో ఒకరు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.

ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో 15 ఏళ్ల బాలికను ముగ్గురు వ్యక్తులు అపహరించి అత్యాచారం చేశారు. ఈ మేరకు బుధవారం పోలీసులు తెలిపారు. అరెస్టు భయంతో ఈ కేసులో ఒక నిందితుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని వారు తెలిపారు.

Latest Videos

'ఒక దేశం- ఒకే ఎన్నిక'పై కేంద్ర ఎన్నిక సంఘం కీలక ప్రకటన

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం తన తండ్రి దుకాణం నుంచి తిరిగి వస్తుండగా బాలిక అపహరణకు గురైంది. ఆమెను మోటార్‌సైకిల్‌పై వచ్చిన వ్యక్తి అడ్డగించి, తర్వాత ఆటోలోకి లాగాడు. మంగళవారం రోడ్డు పక్కన పడి ఉన్న ఆమెను ఇటుక బట్టీల నిర్వాహకులు గుర్తించారు.

బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. ఈ కేసులో తనపై అభియోగాలు మోపారని తెలుసుకున్న నిందితుల్లో ఒకరు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మరో నిందితుడిని అరెస్టు చేశామని, మూడో వ్యక్తి పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు.

భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ)లోని సెక్షన్లు,  లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (ఫోక్సో) చట్టంలోని నిబంధనల ప్రకారం రూపేష్, కరువా, జగదీష్ (18, 20 సంవత్సరాల మధ్య వయస్సు)లపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నిందితులు శంషాబాద్‌లోని ఓ గ్రామానికి చెందినవారు.

మైనర్ బాలికను ఆటోరిక్షాలో కిడ్నాప్ చేసి గ్రామ శివారులో అత్యాచారానికి పాల్పడ్డారని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆనంద్ కుమార్ పాండే తెలిపారు. అతను ఇంకా మాట్లాడుతూ, "విచారణలో భాగంగా.. మేము నిందితుల గ్రామానికి వెళ్లాం. జగదీష్ అనే నిందితుడు అరెస్టు భయంతో తన ఇంటి సమీపంలోని చెట్టుకు ఉరివేసుకున్నాడు" అని తెలిపాడు. 

డిప్యూటి కమీషనర్ ఆఫ్ పోలీస్ సోమేంద్ర మీనా మాట్లాడుతూ.. "నిందితుడైన ఆటోరిక్షా డ్రైవర్ రూపేష్‌ను అదుపులోకి తీసుకున్నాం. అతడిని ప్రశ్నిస్తున్నాం. కరుణను అరెస్టు చేసేందుకు ఆరు బృందాలను కోరినట్లు" తెలిపారు. బాలికకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని, జగదీష్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించామని తెలిపారు.

vuukle one pixel image
click me!