'ఒక దేశం- ఒకే ఎన్నిక'పై కేంద్ర ఎన్నిక సంఘం కీలక ప్రకటన 

Published : Sep 07, 2023, 05:59 AM IST
'ఒక దేశం- ఒకే ఎన్నిక'పై కేంద్ర ఎన్నిక సంఘం కీలక ప్రకటన 

సారాంశం

రాజ్యాంగ నిబంధనలు, ప్రజాప్రాతినిధ్య చట్టంలోని నిబంధనల ప్రకారం ఎన్నికలకు సిద్ధంగా ఉన్నట్లు భారత ఎన్నిక సంఘం తెలిపింది.  5 సంవత్సరాల ప్రభుత్వ పదవీకాలం ముగియడానికి ఆరు నెలల ముందు ఎన్నికలను ప్రకటించవచ్చుననీ రాష్ట్ర అసెంబ్లీలకు కూడా ఇదే పరిస్థితి ఉందని తెలిపింది.

దేశంలోని లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్న బీజేపీ 'వన్ నేషన్, వన్ ఎలక్షన్' ఆలోచనపై రాజకీయ చర్చ సాగుతున్న నేపథ్యంలో కేంద్రం ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. రాజ్యాంగ నిబంధనలు, చట్టపరమైన నిబంధనల ప్రకారం ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధంగా ఉందని తెలిపింది.

మధ్యప్రదేశ్‌లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల సన్నాహాలపై భోపాల్‌లో ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ మాట్లాడుతూ.. నిబంధనల ప్రకారం సకాలంలో ఎన్నికలు పూర్తయ్యేలా చూడటమే కేంద్ర ఎన్నికల సంఘం కర్తమని స్పష్టం చేశారు. ఈ తరుణంలో ఈసీ జమిలి  ఎన్నికలకు సిద్ధంగా ఉందా అనే ప్రశ్నకు ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఇలా సమాధానమిచ్చారు. 

" మా పని సమయానికి ఎన్నికలను నిర్వహించడం. ఆ సమయంలో  రాజ్యాంగం, ప్రజాప్రాతినిధ్య చట్టంలోని నిబంధనలను అమలు చేయడం మా కర్తవ్యం  "అని  బదులిచ్చారు. ఆర్పీ చట్టంలోని నిబంధనల ప్రకారం 5 సంవత్సరాల ప్రభుత్వ పదవీకాలం ముగియడానికి ఆరు నెలల ముందు ఎన్నికలను ప్రకటించవచ్చని, రాష్ట్ర అసెంబ్లీలకు కూడా ఇదే పరిస్థితి ఉందని ఆయన అన్నారు.


లోక్‌సభ , రాష్ట్ర అసెంబ్లీలు, మునిసిపాలిటీలు, పంచాయతీలకు ఏకకాలంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి పరిశీలించి, సిఫార్సులు చేసేందుకు ఎనిమిది మంది సభ్యులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీని గత శనివారం కేంద్రం నియమించింది.

మధ్యప్రదేశ్‌లో 47 షెడ్యూల్డ్ తెగలకు (ఎస్‌టి) మరియు 35 షెడ్యూల్డ్ కులాలకు (ఎస్‌సి) రిజర్వు చేయబడినవి సహా మొత్తం 230 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. రాష్ట్రంలో మొత్తం 5.52 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు అందులో 2.85 కోట్ల మంది పురుషులు, 2.67 కోట్ల మంది మహిళలు, 1,336 మంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నారు. 

 అధికార బీజేపీ, ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ రెండూ మహిళా ఓటర్లపై కేంద్రీకృతమైన పథకాలతో దృష్టి సారించాయి. అలాగే.. ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచేందుకు ఈసీ కూడా ప్రయత్నాలు చేస్తోంది. రాష్ట్రంలోని గిరిజన స్థానాలు నిర్ణయాత్మకమైనవి, ఎందుకంటే వారు జనాభాలో 21 శాతం ఉన్నారు. అందుబాటులో లేని గ్రామీణ ప్రాంతాలలో కూడా ఓటర్ల నుండి ప్రతి 2 కి.మీ.కి పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా ప్రత్యేకించి బలహీన గిరిజన సమూహాల (PVTG) పోలింగ్‌ను మెరుగుపరచడంపై EC దృష్టి సారించింది.

ఎన్నికల్లో పారదర్శకత పెంచాలన్న డిమాండ్‌తో రాష్ట్రంలోని 64,523 పోలింగ్‌ కేంద్రాల్లో 50 శాతం పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌ చేపట్టనున్నట్లు తెలిపారు. వీటిలో 5,000 పోలింగ్ కేంద్రాలను మహిళలు, 1150 మంది యువ ఓటర్లు , 200 మంది పీడబ్ల్యూడీ (వికలాంగులు)లకు కేటాయించనున్నారు. 

పోలింగ్ శాతం తక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో కమిషన్ ప్రత్యేక ప్రచారం నిర్వహిస్తుంది. ఇప్పటివరకు 30 జిల్లాల్లోని 95 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రాష్ట్ర సగటు 75.63 శాతం కంటే తక్కువ పోలింగ్‌ నమోదైనట్లు ఈసీ గుర్తించింది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Nitin Nabin : బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మోదీ నమ్మిన బంటు.. ఎవరీ నితిన్ నబిన్?
Indian Railways : ఇండియన్ రైల్వే బంపర్ ఆఫర్.. తక్కువ ఖర్చుతో దేశమంతా తిరిగేయండిలా !