మాస్క్ లు పంచుతామంటూ వచ్చి గుట్కా ట్రేడర్ మనవడి కిడ్నాప్..

Published : Jul 25, 2020, 12:38 PM IST
మాస్క్ లు పంచుతామంటూ వచ్చి  గుట్కా ట్రేడర్ మనవడి కిడ్నాప్..

సారాంశం

బాలుడిని వదిలపెట్టాలంటే దాదాపు రూ.4కోట్లు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. దీంతో.. బాలుడిని రక్షించాలంటూ బాధితులు పోలీసులను ఆశ్రయించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. స్పెషల్ టాస్క్ ఫోర్స్ అధికారులతో కలిసి దర్యాప్తు ప్రారంభించారు. 

ఓ గుట్కా ట్రేడర్ మనవడిని ఓ కిడ్నాపర్ ముఠా అపహరించింది. కాగా.. ఆరేళ్ల ఆ చిన్నారిని కాపాడేందుకు పోలీసులు బృందాలు రంగంలోకి దిగి.. గంటల వ్యవధిలోనే బాలుడికి కాపాడారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

కాగా.. లక్నోకి చెందిన ఓ గుట్కా ట్రేడర్ రాజేశ్ కుమార్ గుప్తా మనవడిని కొందరు కిడ్నాపర్స్ శుక్రవారం  ఎత్తుకెళ్లారు. ఆరోగ్య శాఖ డిపార్ట్ మెంట్ కి చెందిన వారమంటూ కొందరు కారులో వచ్చి.. మాస్క్ లు పంచుతున్నామంటూ నమ్మించారు. అందరికీ మాస్క్ లు పంచుతూ వచ్చారు. అక్కడే ఉన్న బాలుడిని తమ కారు వద్దకు పిలిచి.. సానిటైజర్ ఇస్తామని చెప్పారు. బాలుడి చెయ్యి చాపకాగానే.. వెంటనే కారులోకి లాక్కున్నారు. అక్కడి నుంచి వారు బాలుడిని కిడ్నాప్ చేయడం గమనార్హం.  

అనంతరం బాలుడిని వదిలపెట్టాలంటే దాదాపు రూ.4కోట్లు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. దీంతో.. బాలుడిని రక్షించాలంటూ బాధితులు పోలీసులను ఆశ్రయించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. స్పెషల్ టాస్క్ ఫోర్స్ అధికారులతో కలిసి దర్యాప్తు ప్రారంభించారు. కేసు నమోదుచేసుకున్న కొద్ది గంటల్లోనే బాలుడిని రక్షించారు. కాగా.. ఈ కేసుతో సంబంధం ఉన్న ప్రతి ఒక్క కిడ్నాపర్ ని అరెస్టు చేసినట్లు పోలీసులు చెప్పారు.

కాగా.. అతి తక్కువ సమయంలో కేసును చేధించి బాలుడిని కాపాడినందుకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పోలీసులకు రూ.2లక్షల నగదు బహుమతి ప్రకటించారు. 

PREV
click me!

Recommended Stories

Condom Sale: ఒకే వ్య‌క్తి ల‌క్ష రూపాయ‌ల కండోమ్స్ కొనుగోలు.. 2025 ఇయ‌ర్ ఎండ్ రిపోర్ట్‌లో ఆస‌క్తిక‌ర విష‌యాలు
IMD Rain Alert : ఇక మంచు తుపాను బీభత్సం... ఆ ప్రాంతాల్లో అల్లకల్లోలమే..!