
న్యూఢిల్లీ : ఢిల్లీలోని నాంగ్లోయ్ ప్రాంతంలో 11 ఏళ్ల బాలిక హత్య కేసులో నిందితుడు పట్టుబడ్డాడు. ఆ చిన్నారి అదృశ్యమైన రోజున ఆమె తల్లికి తెలియని నంబర్ నుండి మిస్డ్ కాల్ రావడంతో ఈ షాకింగ్ హత్య ఘటనకు తెరపడింది. ఫిబ్రవరి 9న కిడ్నాప్ అయి, హత్యకు గురైన బాలిక.. ఘటన జరిగిన రోజు ఉదయమే పాఠశాలకని ఇంటి నుంచి వెళ్లిన తర్వాత కనిపించకుండా పోయింది. అదే రోజు ఉదయం 11.50 గంటలకు ఆమె తల్లికి అన్ నోన్ నెంబర్ నుంచి మిస్డ్ కాల్ వచ్చింది. ఆమె తిరిగి కాల్ చేసినప్పుడు, నంబర్ స్విచ్ అని వచ్చింది.
దీంతో కుటుంబీకులు పోలీసులను సంప్రదించారు. 12 రోజుల తరువాత, ఆ చిన్నారి హత్యకు సంబంధించి రోహిత్ అలియాస్ వినోద్‌గా అనే 21 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. బాధితురాలి తల్లిదండ్రులు ఆమె అదృశ్యమైన రోజున ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. తమ కుమార్తె కిడ్నాప్‌కు గురైందని అనుమానం వ్యక్తం చేస్తూ ఫిబ్రవరి 10న వారు కేసు నమోదు చేశారు.
విచారణలో, పోలీసులు ఎలక్ట్రానిక్ నిఘా ద్వారా మొబైల్ నంబర్‌ను ట్రాక్ చేసి పంజాబ్, మధ్యప్రదేశ్‌లో దాడులు నిర్వహించారు. నిందితుడిని ఫిబ్రవరి 21న పట్టుకుని విచారించగా నేరం అంగీకరించి ఫిబ్రవరి 9న బాలికను హత్య చేసి శవాన్ని ఘెవ్రా మోర్ సమీపంలో పడేసినట్లు వెల్లడించాడు. ముండ్కా గ్రామంలో కుళ్లిపోయిన బాలిక మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కు, పికప్ వ్యాన్ ఢీ.. 11 మంది మృతి, 10 మందికి పైగా గాయాలు
ఆ రోజు ఉదయం 7:30 గంటల ప్రాంతంలో తన కుమార్తె పాఠశాలకు బస్సులో వెళ్లినట్లు బాధితురాలి తల్లి పేర్కొంది. సాయంత్రం వరకు ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. నలుగురు అన్నదమ్ములకు అమ్మాయి ఒక్కతే చెల్లి అని, ఇంట్లో అందరూ ఆమెను చాలా ప్రేమిస్తారని ఆమె తల్లి చెప్పింది.
నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు మృతదేహాన్ని పడేసిన ప్రదేశానికి పోలీసుల బృందం వెళ్లింది. సంఘటన స్థలాన్ని ఫోరెన్సిక్ బృందంతో పరిశీలించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం పంపించారు. నిందితుడిని కోర్టులో హాజరుపరిచి తదుపరి విచారణ నిమిత్తం పోలీసులు రిమాండ్‌కు తరలించారు. పోలీసు ఉన్నతాధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. హత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. బాలికపై లైంగిక వేధింపులు జరిగాయా అనేది పోస్టుమార్టం నివేదిక ద్వారా నిర్ధారిస్తారు. ఈ కేసులో తదుపరి విచారణ కొనసాగుతోంది.