ఆ మెట్లు ఎక్కినా.. దిగినా.. మ్యూజిక్కే మ్యూజిక్కు.. ఎక్కడంటే...

By SumaBala BukkaFirst Published Dec 30, 2021, 12:54 PM IST
Highlights

kerala, కొచ్చిలోని ఎంజీ రోడ్ మెట్రో స్టేషన్ లో మాత్రం దీనికి విరుద్ధం. అక్కడ లిఫ్ట్ ఎక్కమన్నా ఎక్కరు.. ఎస్కలేటర్ మీద హాయిగా నిలబడి పైకి పొమ్మన్నా పోరు.. ఎంచక్కా మెట్ల మీదినుంచి వస్తామని చెబుతారు. ప్రయాణీకులు ఉల్లాసంగా, ఉత్సాహంగా మెట్లు ఎక్కి దిగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. దీనికి కారణం అక్కడి మెట్రో యాజమాన్యం తీసుకున్న ఓ వినూత్న నిర్ణయమే. 

కేరళ : మూడు, నాలుగు అంతస్తులకు stairs ఎక్కాలంటే ఎవరైనా ముందే నీరసపడిపోతారు. అబ్బా lift లేదా అంటూ ఆరా తీస్తారు. గత్యంతరం లేకపోతే ఆయసపడుతూ ఎక్కుతారు. ముఖ్యంగా షాపింగ్ కాంప్లెక్సులు, సినిమా థియేటర్లు, మాల్స్, మెట్రో స్టేషన్లలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. అఫ్ కోర్స్ లిఫ్టులు, ఎస్కలేటర్లు లేకుండా ఉండవు కానీ.. కొన్నిసార్లు పనిచేయడని సందర్భాలు, రద్దీ ఎక్కువగా ఉన్న సందర్బాల్లో నరకం కనిపిస్తుంటుంది. 

అయితే, kerala, కొచ్చిలోని ఎంజీ రోడ్ మెట్రో స్టేషన్ లో మాత్రం దీనికి విరుద్ధం. అక్కడ లిఫ్ట్ ఎక్కమన్నా ఎక్కరు.. ఎస్కలేటర్ మీద హాయిగా నిలబడి పైకి పొమ్మన్నా పోరు.. ఎంచక్కా మెట్ల మీదినుంచి వస్తామని చెబుతారు. ప్రయాణీకులు ఉల్లాసంగా, ఉత్సాహంగా మెట్లు ఎక్కి దిగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. దీనికి కారణం అక్కడి మెట్రో యాజమాన్యం తీసుకున్న ఓ వినూత్న నిర్ణయమే. 

ఎంజీ రోడ్డు Metro Stationలో ఓ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. మెట్లు ఎక్కీ, దిగే సమయంలో వినసొంపైన music వినిపిస్తుంది. మెట్లమీద వెడుతుంటే సప్తస్వరాలు పలుకుతాయి. ఒక్కో మెట్టు ఒక్కో స్వరం పలికేలా ఏర్పాటు చేశారు. దీంతో ఇప్పుడు ఎంజీరోడ్డు మెట్రో స్టేషన్ లోని పియానో మెట్లు ఎక్కి దిగేందుకు ప్రయాణికులు ఎంతో ఆసక్తి చూపుతున్నారు.

ఈ మ్యూజికల్ స్టెప్స్ కంప్యూటర్ తో డిజైన్ చేశారు. మెట్టుమీద అడుగు వేసినప్పుడు లైటింగ్ తో పాటు స్వరం వినిపించేలా ఏర్పాటు చేశారు. ఈ మ్యూజికల్ మెట్లను ట్రాయాక్సియా ఇన్ఫోటెక్ సంస్థ ఇంజనీర్లు రూపొందించారు. 

ఆకలితో ఉన్న వ్యక్తికి భోజనం కొనిచ్చారు.. వారికి ఎదురైన సంఘటనతో షాక్... వైరల్ అవుతున్న వీడియో..

ఇదిలా ఉంటే, కొత్త వేరియంట్ Omicron ఉద్ధృతి నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో మళ్లీ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. Night curfewతో పాటు పాఠశాలలు, కళాశాలలు, జిమ్ లు, సినిమా హాళ్లను మూసివేశారు. ఇక, మెట్రో రైళ్లు, బస్సులను 50 శాతం సామర్థ్యంతో మాత్రమే నడపాలని ప్రభుత్వం ఆదేశించింది. 

అయితే, కొత్త నిబంధనలతో ఢిల్లీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బుధవారం ఉదయం పలు Bus stops, metro stations వద్ద ప్రయాణికులు బారులు తీరి కన్పించారు. ఒక సర్వీసుకు సగం మందితో మాత్రమే బస్సులను, మెట్రోలను నడిపేందుకు అనుమతి ఉండటంతో బస్టాప్ లు , మెట్రో స్టేషన్ల వద్ద అయితే ఈ క్యూలైన్ దాదాపు 2 కిలోమీటర్లకు పైనే ఉండటం గమనార్హం. 

‘కొత్త ఆంక్షల కారణంగా మేం వెళ్లాల్సిన సమయం కంటే 2 గంటలు ముందే ఇంటి నుంచి బయటకు రావాల్సి వస్తోంది. అయినా కూడా ఇక్కడ రద్దీగానే ఉంటోంది. కరోనా ఉద్ధృతి దృష్ట్యా ఇది మంచి నిర్ణయమే అయినప్పటికీ ప్రభుత్వం ప్రత్యామ్నయ ఏర్పాట్లు చేసి ఉండాల్సింది’ అని ప్రయాణికులు తమ ఇబ్బందిని చెబుతున్నారు. 

కాగా, రద్దీ నేపథ్యంలో కొందరు Corona rulesను గాలికొదిలేస్తున్నారు. చాలా స్టేషన్ల వద్ద ప్రయాణికులు కనీసం మాస్కులు కూడా ధరించకుండా కన్పించారు. భౌతిక దూరం కూడా పాటించకుండా గుంపులు గుంపులుగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది.

click me!