ఆన్‌లైన్‌లో బిర్యానీ ఆర్డర్ పెట్టింది, అది తిని మరణించింది.. దర్యాప్తునకు ఆదేశించిన కేరళ మంత్రి

By Mahesh KFirst Published Jan 7, 2023, 12:39 PM IST
Highlights

కేరళలో ఓ యువతి డిసెంబర్ 31వ తేదీన ఓ రెస్టారెంట్ నుంచి బిర్యానీ ఆర్డర్ పెట్టింది. ఆ బిర్యానీ తిన్నప్పటి నుంచి ఆమె చికిత్స పొందుతూనే ఉన్నది. శనివారం ఉదయం మరణించింది. ఫుడ్ పాయిజనింగ్ వల్ల ఆమె మరణించి ఉండొచ్చని చెబుతున్నారు.
 

బెంగళూరు: కేరళలో 20 ఏళ్ల మహిళ డిసెంబర్ 31వ తేదీన ఆన్‌లైన్‌లో బిర్యానీ ఆర్డర్ పెట్టింది. ఆ బిర్యానీ తిన్నాక అనారోగ్యం పాలైంది. చివరికి ఈ రోజు ఉదయం ఓ హాస్పిటల్‌తో పరిస్థితులు విషమించి మరణించింది. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం రియాక్ట్ అయింది. సదరు రెస్టారెంట్ పై యాక్షన్ తీసుకోవాలని ఆదేశించింది. ఫుడ్ పాయిజినింగ్‌తో ఆ యువతి మరణించి ఉంటుందని కొన్ని వర్గాలు చెబుతున్నాయి.

కాసర్‌గోడ్ సమీపంలోని పెరుంబాలాకు చెందిన అంజు శ్రీపార్వతి డిసెంబర్ 31వ తేదీన రొమాన్సియా అనే రెస్టారెంట్ నుంచి బిర్యానీ (కుళిమంతి) కోసం ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టింది. ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన ఆ బిర్యానీని ఆమె తినేసింది. అప్పటి నుంచి ఆమె అనారోగ్యం బారిన పడింది. చికిత్స పొందుతూనే ఉన్నది. తొలుత ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చేర్చారు. ఆ తర్వాత ఆమెను కర్ణాటకకు చెందిన మంగళూరులోని మరో హాస్పిటల్‌కు తరలించారు. అక్కడే చికిత్స పొందుతూనే ప్రాణాలు వదిలింది.

Also Read: వెజ్ బిర్యానీలో ఎముకలు... రెస్టారెంట్ పై కేసు..!

ఈ ఘటనకు సంబంధించి ఆమె తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. శ్రీపార్వతి శనివారం తెల్లవారుజామున మరణించిందని చెప్పారు.

కాగా, కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఫుడ్ సేఫ్టీ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేశామని, ఈ ఘటనపై, ఆ యువతికి అందించిన చికిత్సకు సంబంధించిన వివరాలను డీఎంవో పరిశీలిస్తుందని తెలిపారు. 

ఫుడ్ పాయిజనింగ్ జరిగి ఉంటుందని అనుమానిస్తున్న హోటళ్ల లైసెన్స్‌లను రద్దు చేస్తామని తెలిపారు.

click me!