20 మంది పిల్లలపై కామంతో కీచక ఉపాధ్యాయుడి అఘాయిత్యం.. తరగతి గదిలోనే జుగుప్సాకరంగా..!

Published : Jan 14, 2023, 01:10 PM IST
20 మంది పిల్లలపై కామంతో కీచక ఉపాధ్యాయుడి అఘాయిత్యం.. తరగతి గదిలోనే జుగుప్సాకరంగా..!

సారాంశం

కేరళలో అభంశుభం తెలియని ఆరు, ఏడో తరగతి పిల్లలపై కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ కీచక ఉపాధ్యాయుడు అఘాయిత్యాలకు పాల్పడ్డాడు. 2021 నవంబర్ నుంచి తరగతి గదిలోనే ఈ నేరాలకు పాల్పడుతున్నట్టు పోలీసులు తెలిపారు. ఓ బాలిక మరో టీచర్‌కు దీనిపై మాట్లాడటంతో విషయం వెలుగులోకి వచ్చింది.  

తిరువనంతపురం: కేరళలో ఓ కీచక ఉపాధ్యాయుడు అభం శుభం తెలియని పిల్లలపై కామంతో రగిలిపోయాడు. సుమారు 20 మంది పిల్లలపై వాంఛతో పంజా విసిరాడు. తన కామ కోరికలు తీర్చుకున్నాడు. 2021 నవంబర్ నుంచి ఈ అఘాయిత్యాలకు పాల్పడుతున్నాడు. తరగతి గదిలోనే తరుచూ పిల్లలపై లైంగిక చర్యలకు పాల్పడ్డాడు. 52 ఏళ్ల ఆ కీచక ఉపాధ్యాయుడిని పోలీసులు అరెస్టు చేశారు. కన్నూర్‌లోని తాలిపరంబా పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది.

పోలీసులు ఆ కీచక ఉపాధ్యాయుడిని సీ ఫైజల్‌గా గుర్తించారు మలప్పురంలోని కొండొత్తి నివాసి. ఆ స్కూల్‌లో అరబిక్ భాష బోధిస్తున్నాడు. నిందితుడిని అరెస్టు చేసి ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. అతడిని కస్టడీకి కోర్టు రిమాండ్‌కు పంపింది.

2021 నవంబర్ నుంచి నిందితుడు క్లాసు రూమ్‌లోనే పిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నాడని పోలీసులు తెలిపారు. ఆ విద్యార్థులు ఆరో తరగతి, ఏడో తరగతికి చెందిన చిన్నారులు. 

Also Read: సిలిండర్ లీకేజీతో చెలరేగిన మంటలు.. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు సజీవదహనం.. మృతుల్లో నలుగురు చిన్నారులు..

నిందితుడిని పోక్సో యాక్ట్‌లోి సెక్షన్ 7,8,9ల కింద బుక్ చేశారు. 

ఆ చిన్నారుల్లో ఒకరు మరో టీచర్‌కు ఈ విషయాలు తెలుపడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇప్పించారు. అంతేకాదు, ఈ విషయాన్ని స్కూల్ అధికారులు చైల్డ్ లైన్‌కు కూడా చేర వేశారు. ఈ ఘటన పై స్థానికంగా కలకలం రేగింది.

PREV
click me!

Recommended Stories

ఇక ఓటర్లు BLOల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదు.. SIRపై ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
పై నుంచి చూస్తే ఇడ్లీ, రాగి పిండి క‌వ‌ర్లు.. ఓపెన్ చేసి చూడ‌గా అధికారుల‌ ఫ్యూజులు అవుట్