శబరిమల ఆలయం వద్ద ఉద్రిక్తత: తెరుచుకున్న తలుపులు

Published : Oct 17, 2018, 05:13 PM ISTUpdated : Oct 17, 2018, 05:16 PM IST
శబరిమల ఆలయం వద్ద ఉద్రిక్తత: తెరుచుకున్న తలుపులు

సారాంశం

శబరిమల అయ్యప్ప దేవాలయంలో మహిళల ప్రవేశంపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. శబరిమల అయ్యప్ప దేవాలయంలో ప్రవేశిస్తామంటూ మహిళా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మహిళా భక్తులను బీజేపీ నేతలు, శివసేన కార్యకర్తలు వారిని అడ్డుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఆందోళన కారులపై లాఠీ చార్జ్ చేశారు. కవర్ చేసేందుకు వెళ్లిన మహిళా జర్నలిస్టులను సైతం పోలీసులు అడ్డుకున్నారు.

శబరిమల: శబరిమల అయ్యప్ప దేవాలయంలో మహిళల ప్రవేశంపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. శబరిమల అయ్యప్ప దేవాలయంలో ప్రవేశిస్తామంటూ మహిళా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మహిళా భక్తులను బీజేపీ నేతలు, శివసేన కార్యకర్తలు వారిని అడ్డుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఆందోళన కారులపై లాఠీ చార్జ్ చేశారు. కవర్ చేసేందుకు వెళ్లిన మహిళా జర్నలిస్టులను సైతం పోలీసులు అడ్డుకున్నారు.

సుప్రీంకోర్టు తీర్పు అనంతరం పోలీసుల కట్టుదిట్ట భద్రత నడుమ ఎట్టకేలకు శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయం తలుపులు తెరుచుకున్నాయి. అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు భారీ క్యూ కట్టారు భక్తులు. అయితే క్యూలో మహిళా భక్తులు ఉంటే వారిని బీజేపీ శివసేన కార్యకర్తలు బయటకు పంపించి వేస్తున్నారు. అయితే ఎట్టిపరిస్థితుల్లో ఆలయంలోకి వెళ్లి తీరుతామని హక్కుల నేత తృప్తిదేశాయ్ స్పష్టం చేస్తున్నారు. మహిళా భక్తులు లోపలికి వెళ్లకుండా అడ్డుకునేందుకు బీజేపీ, శివనసేన కార్యకర్తలు సైతం ఆలయ పరిసర ప్రాంతంలోనే కాపుకాశారు. 

మరోవైపు కేరళ ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో తాము జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. సుప్రీం కోర్టు తీర్పును అమలు చేస్తామని కేరళ సీఎం పినరయి విజయన్ స్పష్టం చేశారు. తాము ఎలాంటి కేసులు వేయ్యబోమని తెగేసి చెప్తున్నారు.

PREV
click me!

Recommended Stories

అమర వీరులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఘన నివాళి |Droupadi Murmu Pays Homage at National War Memorial
Fact: ఆ గ్రామంలో ఏ ఇంటికి తాళం వేయరు, అసలు తలుపులే ఉండవు.. ఏంటా గ్రామం, దాని కథేంటి.?