కేరళలో మరో మంకీపాక్స్ కేసు: మూడుకి చేరిన కేసులు

By narsimha lodeFirst Published Jul 22, 2022, 3:05 PM IST
Highlights


కేరళ రాష్ట్రంలో మరో మంకీపాక్స్ కేసు నమోదైంది. దీంతో కేరళ రాష్ట్రంలో  నమోదైన మంకీ పాక్స్ కేసుల సంఖ్య మూడుకి చేరింది. 

తిరువనంతపురం: Keerala  రాష్ట్రంలో మరో Monkey Pox,కేసు నమోదైంది. దీంతో Kerala లో నమోదైన మంకీ పాక్స్ కేసుల సంఖ్య మూడుకి చేరింది.  దేశంలో కేరళ రాష్ట్రంలోనే మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి.  ఈ నెల 6వ తేదీన కేరళకు వచ్చిన వ్యక్తికి మంకీ పాక్స్ నిర్ధారణ అయిందని కేరళ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి Veena George చెప్పారు.  మలప్పురం ప్రాంతానికి చెందిన వ్యక్తికి మంకీపాక్స్ సోకిందని మంత్రి తెలిపారు. మంజేరి మెడికల్ కాలేజీలో బాధితుడు చికిత్స పొందుతున్నట్టుగా మంత్రి వివరించారు.

మంకీ పాక్స్ సోకిన రోగి ఆరోగ్యం నిలకడగా ఉందని మంత్రి తెలిపారు. ఈ రోగిని ఎవరెవరు కలిశారనే విషయమై తాము సమాచారం సేకరిస్తున్నట్టుగా మంత్రి చెప్పారు., దేశంలో తొలి మంకీపాక్స్ కేసు ఈ నెల 14న చోటు చేసుకొంది. కేరళలోని కొల్లాంకు చెందిన వ్యక్తి యూఏఈ నుండి కేరళకు వచ్చారు. మంకీపాక్స్ లక్షణాలు ఉండడంతో ఆయన శాంపిల్స్ పరీక్షిస్తే మంకీపాక్స్ గా నిర్ధారణ అయింది. దుబాయ్ నుండి వచ్చిన మరో వ్యక్తికి మంకీపాక్స్ నిర్ధారణ అయింది.

కర్నూర్ జిల్లాకు చెందిన వ్యక్తికి మంకీపాక్స్ సోకడంతో ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. మరో వైపు మూడో కేసు కూడా నమోదైనట్టుగా మంత్రి వివరించారు. దేశంలో మంకీపాక్స్ కేసులు నమోదు కావడంతో కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. మంకీపాక్స్ పై మార్గదర్శకాలను విడుదల చేసింది. అంతర్జాతీయ విమానాశ్రయలు, ఓడరేవులలో స్క్రీనింగ్ టెస్టులు తప్పనిసరి చేయాలని ఆదేశాలు జారీ చేసింది. 

మంకీ పాక్స్ వైరస్ మశూచికి సమానమైన లేదా అంతకంటే తక్కువైన లక్షణాలతో కూడిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతుంది. మంకీపాక్స్ అనేది జూనోసిస్ జంతువులనుండి మనుషులకు సంక్రమించే వ్యాధిగా వైద్య నిపుణులు చెబుతున్నారు. మంకీ పాక్స్ సాధారణంగా రెండు నుండి 4 వారాల వరకు ఉంటాయి. పిల్లల్లో ఈ వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. మంకీపాక్స్ సోకిన పిల్లల్లో మరణాల రేటు ఎక్కువగా ఉందని వైద్య శాఖాధికారులు చెబుతున్నారు.

also read:కేరళలో రెండో కేసు: దుబాయ్ నుండి వచ్చిన వ్యక్తికి మంకీపాక్స్

మంకీపాక్స్ లక్షణాలు ఉన్న వారి కోసం కేరళ ప్రభుత్వం రెండు రోజుల క్రితం మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ వ్యాధి వ్యాప్తి చెందకుండా ఉండేందుకు గాను మాస్క్ లు తప్పనిసరిగా ఉపయోగించాలని మంత్రి వీనా జార్జి చెప్పారు.కరోనా నియంత్రణకు ఉపయోగించినట్టుగానే ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు గాను ఈ మాస్కులు దోహదపడుతాయని అసెంబ్లీలో మంత్రి వివరించారు. ఈ వైరస్ విషయమై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు గాను ఎమ్మెల్యేల సహకారం అవసరమన్నారు. మంకీపాక్స్ వ్యాప్తి చెందిన దేశాల్లో పర్యటించిన వారికి 21 రోజుల్లో జ్వరం,తలనొప్పి, శరీర నొప్పులు , శరీరంపై ఎర్రటి మచ్చలు వస్తే మంకీపాక్స్ లక్షణాలుగా అనుమానించాలి.ఈ విషయమై వెంటనే పరీక్షలు చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

click me!