లాక్ డౌన్ వేళ చర్చిలో మహిళతో రాసలీలలు: అడ్డంగా బుక్కయిన పాస్టర్

By Sree s  |  First Published May 22, 2020, 5:38 PM IST

లాక్ డౌన్ వేళ ఈ కరోనా వైరస్ మహమ్మారి భయానికి అంతా ఇండ్లకే పరిమితమయితే... కేరళలోని ఒక చర్చి పాస్టర్ మాత్రం ఇదే తన సరససల్లాపాలకు తగిన సమయంగా భావించి చర్చిలోనే దుకాణం మొదలుపెట్టేశాడు. 


లాక్ డౌన్ వేళ ఈ కరోనా వైరస్ మహమ్మారి భయానికి అంతా ఇండ్లకే పరిమితమయితే... కేరళలోని ఒక చర్చి పాస్టర్ మాత్రం ఇదే తన సరససల్లాపాలకు తగిన సమయంగా భావించి చర్చిలోనే దుకాణం మొదలుపెట్టేశాడు. లాక్ డౌన్ సమయంలో చర్చలోకి మహిళ ప్రవేశించిందని తెలుసుకొని అనుమానం వచ్చిన కొందరు లోపలికి వెళ్లి చూడగా మహిళతో పాస్టర్ పట్టుబడ్డాడు.  

వివరాల్లోకి వెళితే... కేరళలోని ఇడుక్కి జిల్లా వెళ్లాయంకుడి చర్చిలో జేమ్స్ మంగళస్సేరి పాస్టర్ గా వ్యవహరిస్తున్నాడు. దేశంలోని మిగితా చర్చిలన్నీ లాక్ డౌన్ వల్ల మూసి ఉన్నప్పటికీ... ఈయనగారు మాత్రం తన చర్చిలోకి మహిళను పిలిపించుకొని రాసలీలల్లో మునిగి తేలుతుండగా అక్కడి ప్రజలు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. 

Latest Videos

గతంలో కూడా ఈ పాస్టర్ గారు అనేక మంది మహిళలతో అక్రమ సంబంధాలను పెట్టుకున్నాడని అక్కడి స్థానికులు అంటున్నారు. గతంలో మాదిరిగానే ఈసారి కూడా గుట్టుగానే సాగిపోతుందిలే... అనుకుంటున్న తరుణంలో, ఈ లాక్ డౌన్ ఆయన అంచనాను తలక్రిందులు చేసింది. 

చర్చి తెరవడానికి అసలు అనుమతులు లేనప్పుడు మహిళా లోనికి ప్రవేశించడం కొందరి కంటపడింది. వారు అనుమానం వచ్చి అక్కడ కాపుకాసి మరికొందరిని కూడా అక్కడికి రమ్మన్నారు. మెల్లిగా లోనికి ప్రవేశించి చూడగా ఆ సదరు మహిళతో పాస్టర్ అడ్డంగా బుక్కయ్యాడు.  ఈ మహిళకు ఇప్పటికే పెళ్ళయ్యి ఇద్దరు పిల్లలున్నారు. 

 

ఇకపోతే... ఆంధ్రప్రదేశ్ పై కరోనా వైరస్ పంజా విసరడం మాత్రం ఆపడంలేదు. తాజాగా గత 24 గంటల్లో మరో 62 కోవిడ్ -19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో మరణం సంభవించింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ శుక్రవారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది. తాజాగా నెల్లూరు జిల్లాపై కూడా కోయంబేడు దెబ్బ పడింది.

రాష్ట్రంలో 8,415 శాంపిల్స్ ను పరీక్షించగా 62 మందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. తాజాగా గత 24 గంటల్లో 51 మంది కరోనా వైరస్ నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జీ అయ్యారు. కరోనా వల్ల గత 24 గంటల్లో కృష్ణా జిల్లాలో ఒకరు మరణించారు. 

 రాష్ట్రంలో ప్రస్తుతం 2514 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 1731 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జీ కాగా, 55 మంది మరణించారు. 728 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.  

గత 24 గంటల్లో నమోదైన 62 కేసుల్లో తమిళనాడులో కోయంబేడుకు సంబంధం ఉన్న కేసులు 18 ఉన్నాయి. కోయంబేడు నుంచి వచ్చిన 18 మందిల్లో నలుగురు చిత్తూరు జిల్లాకు చెందినవారు కాగా, 14 మంది నెల్లూరు జిల్లాకు చెందినవారు.   

click me!