కేరళ విమాన ప్రమాదం: కో పైలట్ మృతి.. 15 రోజుల్లో భార్య డెలీవరి, నిజం దాచిన కుటుంబం

By Siva KodatiFirst Published Aug 8, 2020, 9:48 PM IST
Highlights

ఈ విమాన ప్రమాదంలో మరణించిన కో పైలట్ అఖిలేశ్ శర్మ కుటుంబానిది మరో విషాద గాథ. ఆయన భార్య మేఘ నిండు గర్బిణీ... ఇంకో 15 రోజుల్లో ఆమె బిడ్డకు జన్మనివ్వబోతోంది.

కేరళలో జరిగిన విమాన ప్రమాదం పలువురి కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. కొద్ది నిమిషాల్లో తమ వారిని చూస్తామని భావిస్తూ, విమానాశ్రయంలో, ఇళ్ల దగ్గర ఎదురుచూస్తున్న వారికి చావు వార్త వినిపించింది.

అయితే ఈ విమాన ప్రమాదంలో మరణించిన కో పైలట్ అఖిలేశ్ శర్మ కుటుంబానిది మరో విషాద గాథ. ఆయన భార్య మేఘ నిండు గర్బిణీ... ఇంకో 15 రోజుల్లో ఆమె బిడ్డకు జన్మనివ్వబోతోంది.

Also Read:కోజికోడ్ విమాన ప్రమాదం: మృత్యుంజయులైన కవలలు, తెలియని తల్లి ఆచూకీ

ఈ పరిస్థితుల నేపథ్యంలో భర్త మరణవార్తను కుటుంబసభ్యులు ఆమెకు తెలియనివ్వలేదు. అఖిలేశ్ ప్రమాదంలో గాయపడి చికిత్స తీసుకుంటున్నాడని మాత్రమే చెప్పామని ఆయన సోదరుడు లోకేశ్ శర్మ తెలిపారు.

అన్నయ్య అఖిలేశ్‌కు గాయాలు అయ్యాయని తొలుత సమాచారం అందిందని, అయితే రాత్రి పోద్దుపోయాక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించినట్లు సమాచారం అందిందని లోకేశ్ చెప్పారు.

Also Read:కేరళ విమాన ప్రమాదం.. బ్లాక్ బాక్స్ లభ్యం

ఈ విషయాన్ని మా వదినకు చెప్పలేదని ఆయన వెల్లడించారు. మరో అన్నయ్య భువనేశ్, బావమరిది సంజీవ్ శర్మ కోజీకోడ్‌కు బయల్దేరి వెళ్లారని ఆయన పేర్కొన్నారు.

కాగా, అఖిలేశ్ 2017లో పైలట్‌గా విధుల్లో చేరారు. మేఘాతో 2018లో ఆయన వివాహమైంది. వీరి కుటుంబం ఉత్తరప్రదేశ్‌లోని మథురలో నివసిస్తోంది. 191 మందితో దుబాయ్‌ నుంచి కోజికోడ్‌కు వస్తున్న ఎయిరిండియా విమానం ప్రమాదానికి గురైన ఘటనలో 21 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. 

click me!