ఎయిర్ పోర్టులో కలకలం.. ఇద్దరు ఉగ్రవాదులు అరెస్ట్

By telugu news teamFirst Published Sep 22, 2020, 10:43 AM IST
Highlights

సౌదీ అరేబియా నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులను సోమవారం రాత్రి ఎన్ఐఏ అదుపులోకి తీసుకొని దాదాపు మూడు గంటలపాటు విచారించారు.  ఇద్దరు ఉగ్రవాదుల్లో ఒకరు లష్కరే తోయిబా, మరొకరు భారతీయ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థ సభ్యులని ఎన్ఐఏ అధికారులు చెప్పారు.

కేరళలో ఉగ్రవాదులు కలకలం సృష్టించారు. తిరువనంతపురం ఎయిర్ పోర్టులో పోలీసులు ఇద్దరు ఉగ్రవాదులను జాతీయ దర్యాప్తు బృందం అరెస్టు చేసింది.  లష్కరే తోయిబా, ఇండియన్ ముజాహిదీన్ గ్రూపులకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను కేరళలోని తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎన్ఐఏ అధికారులు సోమవారం రాత్రి అరెస్టు చేశారు.

సౌదీ అరేబియా నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులను సోమవారం రాత్రి ఎన్ఐఏ అదుపులోకి తీసుకొని దాదాపు మూడు గంటలపాటు విచారించారు.  ఇద్దరు ఉగ్రవాదుల్లో ఒకరు లష్కరే తోయిబా, మరొకరు భారతీయ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థ సభ్యులని ఎన్ఐఏ అధికారులు చెప్పారు.

అరెస్టు అయిన వారిలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన గుల్ నవాజ్, మరొకరు షుహైబ్ కేరళలోని కన్నూర్‌కు చెందినవారు. 2008లో బెంగళూరులో జరిగిన వరుస పేలుళ్లకు సంబంధించి ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. ఈ పేలుళ్ల కేసుకు సంబంధించి వారిపై లుకౌట్ నోటీసు కూడా జారీ చేశారు.రియాద్ నగరం నుంచి తిరిగివచ్చిన ఇద్దరు ఉగ్రవాదులను ఎన్ఐఏ, రా ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు దర్యాప్తు చేశాయి. అనంతరం సుహైబ్ ను బెంగళూరుకు, గుల్ నవాజ్ ను ఢిల్లీకి తీసుకువెళ్లామని ఎన్ఐఏ అధికారులు  చెప్పారు. 

click me!