మాస్క్ లేకుండా మెట్రో.. జరిమానా తప్పదు!

By telugu news teamFirst Published Sep 22, 2020, 10:12 AM IST
Highlights

సెప్టెంబరు 11 నుంచి 20వతేదీ వరకు 2,214 మంది ప్రయాణికులు మాస్కు లు ధరించకుండా మెట్రోరైలు స్టేషనుతోపాటు రైళ్లలో ఎక్కారని, వారికి జరిమానాలు విధించామని డీఎంఆర్సీ వెల్లడించింది. కరోనా నిబంధనల ప్రకారం మెట్రోరైలు ఎక్కే ప్రయాణికులు తప్పనిసరిగా మాస్కు  ధరించాలి. 
 

దేశ రాజధాని ఢిల్లీలో మెట్రో సర్వీసు ప్రారంభమైంది. కరోనా మహమ్మారి కారణంగా చాలా కాలం మెట్రో సర్వీసులు బంద్ అయ్యాయి. ఇటీవలే మెట్రో సేవలకు అనుమతి ఇచ్చారు. అయితే.. కరోనా మహమ్మారి నేపథ్యంలో మాస్క్ లు ధరించాలని ప్రభుత్వాలు, అధికారులు చెబుతూనే ఉన్నారు. అయినా కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.

ఈ నేపథ్యంలో మెట్రోరైలు సర్వీసులు ప్రారంభించాక గడచిన రెండు వారాల్లో మాస్కు ధరించకుండా మెట్రోరైలు ఎక్కిన ప్రయాణికులకు ఢిల్లీ మెట్రోరైలు కార్పొరేషన్ (డీఎంఆర్సీ) జరిమానాలు విధించింది. సెప్టెంబరు 11 నుంచి 20వతేదీ వరకు 2,214 మంది ప్రయాణికులు మాస్కు లు ధరించకుండా మెట్రోరైలు స్టేషనుతోపాటు రైళ్లలో ఎక్కారని, వారికి జరిమానాలు విధించామని డీఎంఆర్సీ వెల్లడించింది. కరోనా నిబంధనల ప్రకారం మెట్రోరైలు ఎక్కే ప్రయాణికులు తప్పనిసరిగా మాస్కు  ధరించాలి. 

మరో 5వేల మందికి మాస్కు ధరించాలని కౌన్సెలింగ్ జరిపామని మెట్రోరైలు అధికారులు చెప్పారు. ఢిల్లీలోని 9 రైలు కారిడార్లలో ప్రయాణికులు మాస్కులు ధరించడంతోపాటు సామాజిక దూరం నిబంధనలు పాటించేలా చూసేందుకు స్పెషల్ ఫ్లయింగ్ స్క్వాడ్ లను ఏర్పాటు చేశామని మెట్రోరైలు అధికారులు చెప్పారు.

click me!