మహమ్మారి కాలంలో విదేశీ యూనివర్సిటీల నుంచి 145 డిగ్రీ పట్టాలు పొందాడు..!

Published : Jan 05, 2022, 05:32 PM IST
మహమ్మారి కాలంలో విదేశీ యూనివర్సిటీల నుంచి 145 డిగ్రీ పట్టాలు పొందాడు..!

సారాంశం

కేరళకు చెందిన ఓ వ్యక్తి ఏకంగా 145 డిగ్రీ పట్టాలు పొందాడు. మహమ్మారి మన దేశంలోకి ఎంటర్ అయిన తర్వాత ఆయన ఆన్‌లైన్‌లో కోర్సులు నేర్చుకోవడం మొదలు పెట్టాడు. సుమారు 22 దేశాల్లోని ప్రసిద్ధ యూనివర్సిటీల కోర్సులను ఆయన నేర్చుకున్నాడు. ఇందు కోసం సుమారు నాలుగు నుంచి ఆరు నెలలపాటు నిద్ర కూడా పోలేదు. ఎక్కువ కాలం సిస్టమ్ ముందే నిద్రలేని రాత్రులు గడిపాడు. ఎందుకంటే చాలా యూనివర్సిటీలు విదేశాలకు చెందినవే కావడం.  

తిరువనంతపురం: ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 145 డిగ్రీల(145 Degrees) పట్టాలు పొందాడు. అందుకోసం ఎన్నో సంవత్సరాలూ వెచ్చించలేదు. కేవలం కరోనా వైరస్(Coronavirus) ఫస్ట్ వేవ్ మొదలై ఆంక్షలు విధించినప్పటి నుంచి ఆయన ఆన్‌లైన్‌లో విదేశీ యూనివర్సిటీ(Foreign Universities)ల కోర్సులను చదవడం ప్రారంభించాడు. అంతే.. అప్పటి నుంచి ఇప్పటి వరకు 145 డిగ్రీలు పొందాడు. 16 విదేశాల్లోని యూనివర్సిటీల నుంచి ఆయన పట్టాలు స్వీకరించాడు. ప్రిన్స్‌టన్, యేల్, కొలంబియా, స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీల నుంచి ఆయన డిగ్రీలు పొందడంపై చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాడు ఆ కేరళ వాసి. ఇది కల నిజం కావడం వంటిదని అన్నారు.

కేరళ రాజధాని తిరువనంతపురానికి చెందిన షఫి విక్రమన్ తన ఉద్యోగ రీత్యా దక్షిణ భారతం ఎక్కువగా తిరగాల్సి వచ్చేది. ముఖ్యంగా తమిళనాడులో ఎక్కువ ప్రయాణం చేయాల్సి వచ్చేది. కానీ, కరోనా మహమ్మారి మన దేశంలోకి ప్రవేశించిన తర్వాత ఆంక్షలు పెరిగిపోయాయి. ఆ తర్వాత ప్రయాణాలు చేయడం చాలా కష్టతరంగా మారింది. అందుకే.. అలా తిరగడం మానేసి.. ఏదో ఒక చోట కుదురుగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఆ నిర్ణయం నుంచే తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు. ఆ తర్వాత ఇంటర్నెట్‌లో కొన్ని చిన్న చిన్న కోర్సులు చదవడం మొదలు పెట్టాడు. సర్టిఫికేట్ కోర్సులు చేశాడు. ఆ తర్వాత ఆయన ప్రసిద్ధ విదేశీ యూనివర్సిటీల డిగ్రీ కోర్సులను ఆన్‌లైన్‌లో చదవడానికి సిద్ధపడ్డాడు. 

Also Read: గాండ్రిస్తున్న సింహాన్ని చేతుల్లో బంధించి.. రోడ్డుపై సింపుల్‌గా నడుచుకుంటూ ఓ మహిళ.. షాకింగ్ వీడియో వైరల్

‘నేను స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి తొలుత డిగ్రీ కోర్సు చదివాను. ఆ తర్వాత ఇతర ప్రసిద్ధ యూనివర్సిటీల నుంచి డిగ్రీ కోర్సులు చేయడానికి నిర్ణయించుకున్నాను. మెల్ల మెల్లగా నిర్దేశిత సమయంలో డిగ్రీ కోర్సును పూర్తి చేయడాన్ని ఒంటబట్టించుకున్నాను. తొలుత ఇది చాలా కష్టంగా అనిపించింది. ఆ యూనివర్సిటీలున్న దేశాల కాలమానం.. ఇక్కడి కాలమానం వేరుగా ఉండటంతో లెక్చర్స్ వినడం కూడా చాలా ఇబ్బందిగా మారింది. ముఖ్యంగా ఫస్ట్ కోర్సు చదివేటప్పుడు నేను చాలా కష్టపడ్డాను’ అని వివరించారు.

షఫి ఏ కోర్సు తీసుకోవాలా? అనే సందేహాలను పెద్దగా మోయలేదు. ఏది ఇంటరెస్టింగ్ అనిపించినా చదవడం మొదలుపెట్టాడు. ఎందుకంటే.. తాను చదివిన.. లేదా పరిజ్ఞానం ఉన్న కోర్సులు చాలా తక్కువ. కాబట్టి.. ఏది ఆసక్తికరంగా అనిపించినా చదవడానికి నిశ్చయించుకునేవాడు. కానీ, మెడికల్ ఫీల్డ్‌లో ఎక్కువ కోర్సులు చేశాడని ఆయన వివరించారు. ఆయన తన ఉద్యోగం మానేసిన తర్వాత మళ్లీ కోర్సులు చదవడం కొన్ని సార్లు చాలా కష్టంగా ఉండేదని తెలిపారు. కొన్ని కోర్సులు సవాల్‌ విసిరేవని పేర్కొన్నారు. అంతేకాదు, ముందు ఆయన ఆన్‌లైన్‌లో కోర్సులు చదవడంపై కుటుంబం నుంచి పెద్దగా మద్దతు లభించలేదు. కానీ, మెల్లగా వారు కూడా సహకరించారు.

Also Read: ఒమిక్రాన్.. సాధారణ వైరల్ ఫీవర్ మాత్రమే.. కానీ, జాగ్రత్తగా ఉండాలి: యూపీ సీఎం యోగి

ఆయన చాలా రాత్రులు సిస్టమ్ ముందే గడిపాడు. ఒక్క లెక్చర్‌ను కూడా మిస్ కావడం ఆయనకు ఇష్టం ఉండేది కాదు. సుమారు నాలుగు నుంచి ఆరు మాసాల పాటు అసలు నిద్రే లేదని ఆయన వివరించారు. ఈ విషయాలు చూసి తన కుటుంబం కూడా షాక్‌కు గురైందని, కానీ, ఆ తర్వాత వారు సర్దుకున్నారని తెలిపారు. షఫి ఇప్పుడు మరో 22 కోర్సుల్లో చేరారు. ఇప్పటికి ఆయన మెడిసిన్స్, ఫైనాన్స్, రొబాటిక్స్, కృత్రిమ మేధస్సు, ఫోరెన్సిక్, బ్లాక్ చెయిన్, క్రిప్టో కరెన్సీలపై కోర్సులు ఇప్పటికే ఫినిష్ చేశారు.

PREV
click me!

Recommended Stories

Makarajyothi: ఘనంగా మకర జ్యోతి ఉత్సవం.. దర్శనానికి పోటెత్తిన లక్షలాది స్వాములు | Asianet News Telugu
Petrol Price : లీటర్ పెట్రోల్ ఏకంగా రూ.200... ఎక్కడో కాదు ఇండియాలోనే..!