కేరళ మాజీ ఎమ్మెల్యే పీసీ జార్జ్ అరెస్ట్.. విద్వేష ప్రసంగం ఆరోపణలపై పోలీసులు సీరియస్..

Published : May 01, 2022, 10:29 AM IST
కేరళ మాజీ ఎమ్మెల్యే పీసీ జార్జ్ అరెస్ట్.. విద్వేష ప్రసంగం ఆరోపణలపై పోలీసులు సీరియస్..

సారాంశం

కేరళకు చెందిన మాజీ ఎమ్మెల్యే పీసీ జార్జ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసినందుకు ఆయనపై నాన్ బెయిల్ సెక్షన్ కింద కేసు నమోదు చేసిన తిరువనంతపురం పోర్టు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.   

కేరళకు చెందిన మాజీ ఎమ్మెల్యే పీసీ జార్జ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం Ananthapuri Hindu Mahasammelanam‌లో పాల్గొన్న పీసీ జార్జ్ పలు వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ముస్లిం సమాజం మనోభావాలు దెబ్బతీసేలా, మత విద్వేషాలను వ్యాప్తి చేసేలా ఉన్నాయనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే కేరళ పోలీస్ చీఫ్ అనిల్ కాంత్ ఆదేశాల మేరకు తిరువనంతపురం పోర్టు పోలీసులు పీసీ జార్జ్‌పై సుమోటోగా చర్యలు తీసుకున్నారు. ఆయనపై ఐపీసీలో సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.  అనంతరం పీసీ జార్జ్‌ను  పోలీసులు ఆయన ఇంటి నుంచి అదుపులోకి తీసుక్నారు. 

‘‘వర్తకం చేసే ముస్లింలు ఉద్దేశపూర్వకంగా వంధ్యత్వానికి సంబంధించిన మందులను పానీయాలలో కలుపుతున్నారు. ముస్లింలు తమ జనాభాను పెంచి ముస్లిం దేశంగా మార్చడానికి ప్రయత్నిస్తున్నారు. ముస్లిం పూజారులు మూడుసార్లు ఉమ్మివేసి ఆహారాన్ని పంపిణీ చేస్తారు. ముస్లిం వ్యాపారులు ముస్లిమేతర ప్రాంతాల్లో తమ సంస్థలను స్థాపించి వారి సంపదను దోచుకుంటారు’’ అని పీసీ జార్జ్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. 

ఇక, పీసీ జార్జ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోవడాన్ని బీజేపీ నేతల ఖండించారు. కుమ్మనం రాజశేఖరన్‌ మాట్లాడుతూ.. కేరళలో జార్జ్ చెప్పినట్లుగానే చాలా జరుగుతున్నాయని అన్నారు. మరోవైపు ప్రతిపక్ష నేత వీడీ సతీశన్‌ మాట్లాడుతూ.. పోలీసులు చర్య తీసుకోవడం సరైనదే.. విద్వేషపూరిత ప్రసంగాలు అల్లర్లకు దారితీస్తాయని అన్నారు.

పీసీ జర్జ్ చేసిన వ్యాఖ్యలు ఇలా ఉన్నాయి..
దేవాలయాలను హిందూ పాలనలోకి తీసుకురావాలి. స్థానిక హిందువులతో కూడిన కమిటీలు ఆలయాన్ని నిర్వహించాలన్నారు. చర్చి, మసీదులు.. క్రైస్తవ, ముస్లిం కమిటీల క్రింద ఉన్నాయి. అలాంటప్పుడు హిందువులపై వివక్ష ఎందుకు..? అని ప్రశ్నించారు.  భారతదేశాన్ని హిందూ దేశంగా ప్రకటించాలని కూడా కోరారు. ‘‘హిందూత్వమే అసలైన సంస్కృతి. ఇది బహుళ మతాలు, బహుళ సంస్కృతులను కలుపుతుంది. ప్రజాస్వామ్యం ఎవరికైనా ఏదైనా చేసే స్వేచ్ఛను ఇచ్చింది. మేము లోకా సమస్తా సుఖినోభవంతు అని నమ్ముతాము. కాబట్టి హిందూ సంస్కృతికి అండగా నిలిచే భారతదేశాన్ని హిందూ దేశంగా ప్రకటించాలి’’ అని అన్నారు.

ముస్లిం అమ్మాయిలు... హిందూ, క్రిస్టియన్ అమ్మాయిలు తగిన ముస్లిం అబ్బాయిలను కలవడానికి సహాయం చేస్తారని.. తద్వారా లవ్ జిహాద్‌ను సులభతరం అవుతుందని ఆరోపించారు. తాను మతాంతర వివాహాలకు వ్యతిరేకం కాదని.. హిందూ, క్రిస్టియన్ అమ్మాయిలను మతం మార్చడానికి ఉద్దేశపూర్వక చేసే ట్రాప్‌కు వ్యతిరేకం అని అన్నారు.

తాను లవ్ జిహాద్‌కు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు.. వారు తనను ఉద్దేశపూర్వకంగా ఓడించారని ఆరోపించారు. హిందువులు సమావేశాలు నిర్వహించేందుకు మాత్రమే ఆసక్తి చూపుతున్నారని.. ముస్లిం కుట్రలకు వ్యతిరేకంగా చర్య తీసుకోవడానికి వారు ఇష్టపడరని చెప్పారు. అదే సమయంలో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ లౌడ్ స్పీకర్లపై నిషేధం విధించడాన్ని పీసీ జార్జ్ ప్రశంసించారు. దేవాలయాలతో పాటు మసీదుల్లో లౌడ్ స్పీకర్లను యోగి నిషేధించారని.. ఇది ఎంతో గౌరవప్రదమైన నిర్ణయం అని పేర్కొన్నారు. 

PREV
click me!

Recommended Stories

Narendra Modi Plays Football with Youth in Gangtok Visit | Foot Ball Playing | Asianet News Telugu
LPG New Rules : గ్యాస్ బుకింగ్‌పై కొత్త రూల్స్..? మే 1 నుంచి కీలక మార్పులు..!