ఆవుల జననాంగాల్లోకి కర్రలు జొప్పించి అత్యాచారం.. కేరళ రైతుల ఆవేదన.. వెలుగులోకి దారుణం...

Published : Sep 06, 2021, 12:15 PM ISTUpdated : Sep 06, 2021, 12:28 PM IST
ఆవుల జననాంగాల్లోకి కర్రలు జొప్పించి అత్యాచారం.. కేరళ రైతుల ఆవేదన.. వెలుగులోకి దారుణం...

సారాంశం

తంబి అనే రైతుకు ఏడు ఆవులు ఉండేవి. వాటిల్లో నాలుగింటిని అమ్మేశాడు. కారణం.. వాటిపై ఐదుసార్లు అత్యాచారం జరగడం, ఆవులను కట్టేసి కొట్టడమే కాకుండా నిందితుడు.. వాటి జననాంగాల్లో కర్రలను చొప్పించేవాడట. పొదుగులను రాళ్లతో కొట్టి గాయపర్చేవాడని రైతులు ఆరోపించారు. 

కేరళలోని కొల్లం జిల్లా మయనాడ్ లోని కొందరు రైతులకు విచిత్ర సమస్య తలెత్తింది. వారంతా తమనకు జీవనాధారమైన ఆవులను అమ్మేసుకుంటున్నారు. ఇలా ఎందుకు అనుకుంటున్నారా? కారణం ఉంది. వారి ఆవుల మీద ఓ వ్యక్తి అత్యాచారం చేస్తున్నాడట.

ఇదే గోడు పోలీసులకు చెప్పారు. ఇక్కడ 20మంది పశుపోషకులు బాధితులుగా మారారు. 2021 జనవరి నుంచి తరచూ వారి ఆవుల పై దాడి జరుగుతుంది. చాలా రోజుల వరకు వారికి అసలు విషయం తెలియలేదు. సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించాకే.. అది లైంగిక దాడి అని తెలిసొచ్చింది. తంబి అనే రైతుకు ఏడు ఆవులు ఉండేవి.

వాటిల్లో నాలుగింటిని అమ్మేశాడు. కారణం.. వాటిపై ఐదుసార్లు అత్యాచారం జరగడం, ఆవులను కట్టేసి కొట్టడమే కాకుండా నిందితుడు.. వాటి జననాంగాల్లో కర్రలను చొప్పించేవాడట. పొదుగులను రాళ్లతో కొట్టి గాయపర్చేవాడని రైతులు ఆరోపించారు. 

‘ఎవరో వ్యక్తిగత కక్షతో మా ఆవులపై దాడి చేస్తున్నారనుకున్నా. ఆ తర్వాత చాలామంది రైతులు ఇదే సమస్యను లేవనెత్తారు. అప్పుడే తెలిసింది.. ఈ వ్యక్తి అసహజన రీతిలో ఆవులమీద లైంగిక కార్యకలాపాలు సాగిస్తున్నాడు’ అని తంబి అనే రైతు తెలిపారు. 

ఇలాంటి సమస్య ఉన్న 20 మంది కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిని పట్టుకుని.. పోలీసులకు అప్పగించారు. రైతులు అనుమానిస్తున్న వ్యక్తి మానసిక స్థితి బాగాలేదని, ఈ వ్యవహారంమీద దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్