కూతురిపై తండ్రి అత్యాచారం.. ఆత్మహత్య చేసుకున్న సోదరుడు..!

Published : Sep 06, 2021, 10:43 AM IST
కూతురిపై తండ్రి అత్యాచారం.. ఆత్మహత్య చేసుకున్న సోదరుడు..!

సారాంశం

ఈ ఆడియో క్లిప్ బయటకు వచ్చింది. దాదాపు 32 నిమిషాలపాటు ఉన్న ఈ ఆడియో క్లిప్ వెలుగులోకి రావడంతో.. అసలు దారుణం బయటపడింది. 

ఓ వ్యక్తి కంటికి రెప్పలా కాపాడాల్సిన కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తన రక్తం పంచుకు పుట్టిన బిడ్డ అనే కనికరం లేకుండా దారుణంగా ప్రవర్తించాడు. కాగా.. ఈ విషయం తెలిసిన అతని కుమారుడు.. ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన రాజస్థాన్ లో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

బాలిక తన తండ్రి తనపై చేసిన దారుణాన్ని.. తన అత్తకు వివరించింది. ఈ ఆడియో క్లిప్ బయటకు వచ్చింది. దాదాపు 32 నిమిషాలపాటు ఉన్న ఈ ఆడియో క్లిప్ వెలుగులోకి రావడంతో.. అసలు దారుణం బయటపడింది. 

కాగా.. తన తండ్రి చేసిన ఘోరం తెలుసుకున్న ఆ బాలిక సోదరుడు.. వెంటనే దగ్గరలోని చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు బాలిక ఇంటికి చేరుకునే సమయానికి..  నిందితుడు పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

కాగా.. తన తండ్రి మొబైల్ ఫోన్ కొనిపెడతానని.. కారులో బయటకు తీసుకువెళ్లి.. ఆమెపై అత్యాచారానికి పాల్పడటం గమనార్హం. ఆ రోజు బాలికను బయటకు తీసుకువెళ్లే సమయంలో.. ఆమె సోదరుడిని కూడా తీసకువెళ్లమని తల్లి కోరగా.. తండ్రి నిరాకరించడం గమనార్హం. 

PREV
click me!

Recommended Stories

Tamilnadu Incidnt : నిందితుడికి రెండు మరణశిక్షలు | Asianet News Telugu
Coimbatore Child Case: 10 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగితే జోకులేంటి... సస్పెండ్ చేసిన సీఎం విజయ్