
తిరువనంతపురం: మెట్రో మ్యాన్ ఈ. శ్రీధరన్ ను కేరథ సీఎం అభ్యర్ధిగా బీజేపీ గురువారం నాడు ప్రకటించింది. గత వారంలోనే మెట్రో మ్యాన్ శ్రీధరన్ బీజేపీలో చేరాడు. ఆయన వయస్సు 88 ఏళ్లు.
కేరళ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రన్ విజయ్ యాత్ర పేరుతో టూర్ నిర్వహిస్తున్నారు.ఈ యాత్రలో ఆయన శ్రీదరన్ పేరును ప్రకటించారు.
రాష్ట్రంలోని ఇతర అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్ధుల జాబితాను పార్టీ త్వరలోనే ప్రకటించనుందని ఆయన తెలిపారు.
రెండు వారాల క్రితం బీజేపీలో చేరాలని నిర్ణయం తీసుకొన్నట్టుగా శ్రీధరన్ ప్రకటించారు. అంతేకాదు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి తాను సిద్దంగా ఉన్నానని ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే.
రాష్ట్రంలోని ఏ నియోజకవర్గం నుండి పోటీ చేయాలనే దానిపై ఆయన ఇంకా నిర్ణయం తీసుకోలేదని శ్రీధరన్ తెలిపారు. తాను ఏ సీటులోనైనా పోటీ చేయడానికి సిద్దంగా ఉన్నట్టుగా చెప్పారు. బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తోందని నమ్ముతున్నట్టుగా ఆయన చెప్పారు.
కొచ్చి మెట్రో ప్రాజెక్టుకు శ్రీధరన్ గురువుగా పిలుస్తారు. డోర్ టూ డోర్ క్యాంపెయిన్ చేయనని ఆయన చెప్పారు. కానీ తాన సందేశం ఓటర్లకు చేరుతుందని ఆయన కొచ్చిలో చెప్పారు.