చేపల వ్యాపారి నుండి 119కి కరోనా: పుంథూరాలో కమాండోల పహారా

By narsimha lode  |  First Published Jul 9, 2020, 3:38 PM IST

కేరళ రాష్ట్రంలోని పుంథూరా గ్రామంలో కరోనాను వ్యాప్తి చేసే సూపర్ స్ప్రెడర్లు ఉన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఈ గ్రామాన్ని 25 కమాండోల బృందం తమ ఆధీనంలోకి తీసుకొంది.
 



తిరువనంతపురం: కేరళ రాష్ట్రంలోని పుంథూరా గ్రామంలో కరోనాను వ్యాప్తి చేసే సూపర్ స్ప్రెడర్లు ఉన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఈ గ్రామాన్ని 25 కమాండోల బృందం తమ ఆధీనంలోకి తీసుకొంది.

also read:కరోనాతో 21,129 మంది మృతి: ఇండియాలో 7,67,296కి చేరిన కరోనా కేసులు

Latest Videos

ఈ గ్రామాన్ని కరోనా క్లస్టర్ గా గుర్తించింది రాష్ట్ర ప్రభుత్వం. అత్యధిక సూపర్ స్ప్రెడర్లను అధికారులు గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకొన్నారు. గ్రామస్తులంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశించారు. అనవసరంగా ఎవరైనా బయట కనపడితే  క్వారంటైన్ కేంద్రాలకు పంపుతామని అధికారులు హెచ్చరించారు.

ఒక వ్యక్తి నుండి ఆరుగురికి కరోనా సోకితే సూపర్ స్ప్రెడర్ గా పిలుస్తారు. పుంథూరా గ్రామంలో మాత్రం అత్య‌ధిక సూప‌ర్ స్ప్రెడ‌ర్లు ఉన్నారు.  వీరి ద్వారా కరోనా వ్యాప్తి చెందకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకొన్నారు.

ఈ గ్రామంలో ఆరు ప్రత్యేక వైద్య బృందాలు గ్రామస్తులకు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ గ్రామంలోని చేపల వ్యాపారికి తొలిసారిగా కరోనా సోకింది. ఆయన కాంటాక్ట్ అయిన వారిలో 600 మందికి పరీక్షలు నిర్వహిస్తే 5 రోజుల్లో 119 మందికి కరోనా సోకింది. ఇంకా కొందరి పరీక్షల ఫలితాలు రావాల్సి ఉంది.

ఇతను తమిళనాడు రాష్ట్రానికి కూడ చేపలను ఎగుమతి చేస్తుంటాడు. కరోనా నేపథ్యంలో మత్సకారులు ఎవరూ కూడ చేపల వేటకు వెళ్లకూడదని జిల్లా కలెక్టర్ నవజోత్ ఖోసా ఆదేశించారు. గ్రామం మొత్తం శానిటేషన్ చేస్తున్నారు. 

click me!