రూ. 50 లక్షల మినీ కూపర్ కారు కొనుగోలు.. వివాదంలో కేరళ కమ్యూనిస్టు నేత

By Mahesh KFirst Published May 30, 2023, 3:19 PM IST
Highlights

కేరళ సీఐటీయూ అనుబంధ కార్మిక సంస్థ పెట్రోలియ, గ్యాస్ వర్కర్స్ యూనియన్ స్టేట్ ప్రెసిడెంట్ పీకే అనిల్ కుమార్ వివాదంలో చిక్కుకున్నారు. ఖరీదైన మినీ కూపర్ కారును సొంతం చేసుకుంటున్నట్టు కనిపిస్తున్న ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
 

కొచ్చి: కేరళ పెట్రోలియం అండ్ గ్యాస్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర జనరల్ సెక్రెటరీ పీ కే అనిల్ కుమార్‌ కొత్త వివాదంలో చిక్కుకున్నారు. రూ. 50 లక్షల విలువైన విలాసవంతమైన మినీ కూపర్ కారును కొనుగోలు చేస్తున్నట్టు దాని ముందు దిగిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై విమర్శలు వస్తున్నాయి. ఈ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ (సీఐటీయూ) అనుబంధ కార్మిక సంఘం.

మినీ కూపర్ కారు కొనుగోలు చేసినట్టు కనిపిస్తున్న ఫొటోపై విమర్శలు రావడంతో సీపీఎం పార్టీ దర్యాప్తు ప్రారంభించింది. ఈ సీఐటీయూ నేత వైరల్ ఫొటో పై స్పందించారు. తన భార్య ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సంస్థలో ఉద్యోగి అని, ఆ కారు ఆమెనే కొనుగోలు చేసిందని వివరించారు.

పీ కే అనిల్ కుమార్ వద్ద టయోటా క్రెస్టా లిమిటెడ్ ఎడిసన్, ఒక టయోటా ఫార్చూనర్ వాహనాలు కూడా ఉన్నట్టు తెలిసింది. మినీ కూపర్ కారును డీలర్షిప్ నుంచి తీసుకుంటున్నట్టుగా పోజు ఇచ్చిన ఫొటో వైరల్ కావడంతో అనేక ప్రశ్నలు వచ్చాయి.

Also Read: తన లవర్ వేరే యువతిని పెళ్లి చేసుకున్నాడని సలసల కాగే వేడి నీటిని మీద పోసింది.. కేసు నమోదు

పీకే అనిల్ కుమార్ నివాసం కూడా 4000 చదరపు అడుగుల భవనం అని, పనాంపల్లి నగర్ కొచ్చి‌లో ఆ భవనం ఉన్నది. అంతేకాదు, ఆయన వసూళ్లు చేపడతాడని, వాటిని ఎర్నాకుళం సీపీఎం సెక్రెటరీ సీఎన్ మోహన్, ఇతర టాప్ నేతలతో కలిసి పంచుకుంటారని ఆరోపణలు ఉన్నాయి.

click me!