పార్టీలో మహిళపై కత్తితో దాడి.. టెర్రస్ పై రక్తపు మడుగులో శవంగా....

Published : May 30, 2023, 02:48 PM IST
పార్టీలో మహిళపై కత్తితో దాడి.. టెర్రస్ పై రక్తపు మడుగులో శవంగా....

సారాంశం

నైట్ పార్టీకి హాజరైన ఓ మహిళ చివరికి మృతదేహంగా మారిన ఘటన ఢిల్లీలో కలకలం రేపింది. 

న్యూఢిల్లీ  : ఉత్తర ఢిల్లీలో నిన్న రాత్రి ఓ మహిళ హత్య ఘటన వెలుగు చూసింది. రాత్రి జరిగిన పార్టీలో గొడవ తలెత్తడంతో 22 ఏళ్ల మహిళను ఓ వ్యక్తి కత్తితో పొడిచి చంపాడు. మంగళవారం ఉదయం మజ్ను క తిల్లాలోని ఇంటి టెర్రస్‌పై రక్తసిక్తమైన ఆమె మృతదేహం లభ్యమైందని పోలీసులు తెలిపారు.

మృతురాలిని సఫ్దర్‌గంజ్‌లో నివాసం ఉంటున్న మనీషా ఛెత్రిగా గుర్తించారు. ఆమె సప్నా అనే మహిళ ఇంట్లో జరిగిన పార్టీకి హాజరయ్యింది. ఆమెతో పాటు ఒక పురుషుడు, మరో ఇద్దరు మహిళలు కూడా ఆ పార్టీలో ఉన్నారు.

అకస్మాత్తుగా పార్టీలో జరిగిన గొడవ త్తిపోట్లకు దారితీసిందని పోలీసులు తెలిపారు. ఏదో విషయంలో తలెత్తిన గొడవతోఓ వ్యక్తి కత్తితో మనీషా ఛెత్రి మీద దాడికి దిగాడు. ఈ ఉదయం జరిగిన ఘటనపై సప్న పోలీసులకు సమాచారం అందించింది.

నిందితుడిని గుర్తించామని, త్వరలో అరెస్టు చేస్తామని, హత్య కేసు నమోదు చేశామని తెలిపారు. బాధితురాలు, నిందితుడు వివిధ ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీల్లో పనిచేస్తారని తెలిపారు.  తదుపరి విచారణ కొనసాగుతోంది.

తన లవర్ వేరే యువతిని పెళ్లి చేసుకున్నాడని సలసల కాగే వేడి నీటిని మీద పోసింది.. కేసు నమోదు

ఇదిలా ఉండగా, ఢిల్లీలో ఆదివారం సాయంత్రం ఓ యువకుడు తన ప్రియురాలిని పలుమార్లు కత్తితో పొడిచి, బండరాయితో ఆమె తలను చితకబాదిన ఘటన చోటుచేసుకుంది. నేరం వెనుక ఉన్న ఉద్దేశ్యాన్ని తెలుసుకోవడానికి పోలీసులు ఇంకా ప్రయత్నిస్తున్నారు. యువతి కొన్ని రోజుల క్రితం ఆ వ్యక్తిని భయపెట్టడానికి బొమ్మ పిస్టల్‌ను గురిపెట్టిందని పోలీసుల విచారణలో తేలింది. 

బాలిక తమ మూడేళ్ల బంధానికి ముగింపు పలకాలని కోరుకోవడంతో ఇద్దరికీ  గత కొంతకాలంగా గొడవ పడుతున్నారని తేలింది. దీనికి అతను ఒప్పుకోకపోవడంతో పోలీసులను ఆశ్రయిస్తానని కూడా బాలిక బెదిరించిందని వారు తెలిపారు. అమ్మాయి చేతి మీద మరొక వ్యక్తి పేరు పచ్చబొట్టు కూడా ఉందని సమాచారం. 

నిందితుడు ఫ్రిజ్, ఏసీ మెకానిక్‌గా పనిచేసిన సాహిల్ గా గుర్తించారు. వాయువ్య ఢిల్లీలోని షహబాద్ డెయిరీ ప్రాంతంలో జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతంలోని రద్దీగా ఉండే లేన్‌లో రాయితో తల పగులగొట్టే ముందు బాలికను 20 సార్లు కత్తితో పొడిచి చంపాడు.

సమీపంలోని సీసీ కెమెరా ద్వారా బంధించబడిన సంఘటనకు చెందిన చిల్లింగ్ ఫుటేజీ, నిందితుడు బాధితురాలిని ఒక చేత్తో గోడకు ఒత్తిపట్టి  పదేపదే కత్తితో పొడిచినట్లు చూపించింది. బాలిక నేలపై పడిపోయినా అతతగ ఆగలేదు. ఆమెను తన్నడం, ఆమె మీద పదేపదే సిమెంట్ స్లాబ్‌ తో దాడి చేయడం కనిపించింది.

ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లోని అతని అత్త ఇంటి నుంచి 20 ఏళ్ల యువకుడిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. బాలికతో స్నేహం చేసేందుకు సాహిల్ తన పేరు మార్చుకున్నాడా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఈ ఘటనపై లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాపై విరుచుకుపడిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీలో శాంతిభద్రతల బాధ్యత తనదేనని, ‘ఏదైనా చేయమని’ ఆయనను కోరారు. ఢిల్లీ మహిళా ప్యానెల్ కూడా ఈ సంఘటన మీద స్పందించింది. స్వాతి మలివాల్ పోలీసులను నిందించింది.దేశ రాజధానిలో పోలీసులకు, చట్టానికి "ఎవరూ భయపడడం లేదు’ అంటూ విమర్శించారు. 

PREV
click me!

Recommended Stories

Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్