సీఎం అభ్యర్ధిని కేంద్ర నాయకత్వం నిర్ణయిస్తోంది: బీజేపీ కేరళ అధ్యక్షుడు సురేంద్రన్

Published : Mar 07, 2021, 10:35 AM IST
సీఎం అభ్యర్ధిని కేంద్ర నాయకత్వం నిర్ణయిస్తోంది: బీజేపీ కేరళ అధ్యక్షుడు సురేంద్రన్

సారాంశం

కేరళలో సీఎం అభ్యర్ధిగా మెట్రో మ్యాన్ శ్రీధరన్ పేరును ప్రకటించలేదని  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రన్ ప్రకటించారు.

తిరువనంతపురం: కేరళలో సీఎం అభ్యర్ధిగా మెట్రో మ్యాన్ శ్రీధరన్ పేరును ప్రకటించలేదని  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రన్ ప్రకటించారు.

కేరళ రాష్ట్ర అసెంబ్లీకి ఈ ఏడాది ఏప్రిల్ 6వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి.ఈ ఎన్నికల్లో తమ సత్తా చాటాలని బీజేపీ భావిస్తోంది. పది రోజుల క్రితం మెట్రో మ్యాన్ శ్రీధరన్  బీజేపీలో చేరాడు. పార్టీలో చేరిన శ్రీధరన్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి ఆసక్తిగా ఉన్నట్టుగా తెలిపారు.

also read:మెట్రో మ్యాన్ శ్రీధరన్‌ కేరళ సీఎం అభ్యర్ధి: బీజేపీ ప్రకటన

కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయ్ యాత్ర పేరుతో బీజేపీ చీఫ్ సురేంద్రన్ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఈ యాత్రలో భాగంగా ఆయన  గత వారంలో సీఎం అభ్యర్ధిగా మెట్రో మ్యాన్ శ్రీధరన్ పేరును ప్రకటించారని మీడియాలో వార్తలు వచ్చాయి.

  క్లీన్ ఇమేజ్ ఉన్న శ్రీధరన్ సీఎం అభ్యర్ధిగా ప్రకటించడంతో పార్టీకి కలిసి వచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావించారు. అయితే ఈ విషయమై సురేంద్రన్ వివరణ ఇచ్చారు.

కేరళ ప్రజలు , తమ పార్టీ నేతలు శ్రీధరన్ తమకు నాయకత్వం వహించాలని కోరుకొంటున్నారని తాను చెప్పానని ఆయన తెలిపారు. బీజేపీ కేంద్ర నాయకత్వమే సీఎం అభ్యర్ధిని నిర్ణయిస్తోందని ఆయన స్పష్టం చేశారు. కేరళ ప్రజలు శ్రీధరన్ లాంటి నాయకుడు తమకు నాయకత్వం వహించాలని కోరుకొంటున్నారని ఇందులో ఎలాంటి సందేహం లేదని తాను నిన్న చెప్పినట్టుగా ఆయన వివరించారు. 

కేరళ రాష్ట్ర బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగిన, తాను ఏమి చెప్పానో నాకు తెలుసు. కేరళ ప్రజలు శ్రీధరన్ నాయకత్వాన్ని కోరుకొంటున్నారని చెప్పడం మినహా తాను ఎలాంటి ప్రకటన చేయలేదని సురేంద్రన్ తెలిపారు.

PREV
click me!

Recommended Stories

Indigo Crisis: ఇండిగో ఎయిర్ లైన్స్‌కి ఏమైంది.. అస‌లీ గంద‌ర‌గోళం ఏంటి.?
Modi : అసోం టీ నుండి భగవద్గీత వరకు.. పుతిన్‌కు మోదీ ఇచ్చిన గిఫ్ట్‌లు ఇవే